మెహ్రీన్ టైమ్ అస్స‌లు బాగోలేదుగా..!

రెండు నెల‌ల్లోనే ఐదు సినిమాల‌తో వ‌చ్చిన చ‌రిత్ర మెహ్రీన్ కౌర్ సొంతం. కానీ ఆ ఐదు సినిమాల్లో ఆడింది ఒక్క‌టే. అది కూడా రాజా ది గ్రేట్. తొలి సినిమా కృష్ణ‌గాడి వీర ప్రేమగాధ త‌ర్వాత ఒక్క‌టే హిట్ కొట్టింది మెహ్రీన్. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు వ‌చ్చిన‌ట్లుగా వెళ్లిపోతున్నాయి.

mehreen kaur pirzada

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లో మ‌హాల‌క్ష్మిగా ఎంతో ప‌ద్ద‌తిగా ఒళ్లంతా క‌ప్పుకుని అచ్చ తెలుగ‌మ్మాయిలా క‌నిపించింది ఈ భామ‌. కానీ పైకి క‌నిపించేంత అమాయ‌కురాలేం కాదు ఈ భామ‌. అవ‌కాశం రావాలే కానీ గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొట్ట‌డానికి కూడా తాను సిద్ధ‌మ‌ని హింట్ ఇచ్చింది మ‌హ్రీన్. ఇప్ప‌టికే జ‌వాన్ లాంటి సినిమాల్లో దాన్ని ఆచ‌ర‌ణలో పెట్టింది కూడా.

కానీ ఏం చేస్తాం.. అదృష్ట‌మే క‌లిసిరాలేదు. ఈ ఏడాది గోపీచంద్ తో న‌టించిన పంతం.. మొన్న విజ‌య్ దేర‌వ‌కొండ‌తో న‌టించిన నోటా కూడా ఫ్లాప్ అయింది. దానికి ముందు జ‌వాన్ కూడా ఫ్లాపే. ఇలా వ‌ర‌స ఫ్లాపుల‌తో ప్ర‌స్తుతం డీలా ప‌డిపోయింది మెహ్రీన్ కెరీర్. ఏదైనా అద్భుతం జ‌రిగితే కానీ ఈమె కెరీర్ ఇప్పుడు నిల‌బ‌డ‌దు. అందుకే అలాంటి అద్భుతం కోస‌మే చూస్తుంది. ప్ర‌స్తుతం ఎఫ్ 2లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

అనిల్ రావిపూడి త‌న‌కు మ‌రో హిట్ ఇస్తాడని న‌మ్ముతుంది. పైగా గ్లామ‌ర్ రోల్స్ కు సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇస్తుంది మెహ్రీన్. మొత్తానికి గాడి త‌ప్పిన కెరీర్ ను మ‌ళ్లీ దారిన పెట్టుకోడానికి అందాల ఆర‌బోతే స‌రైన మార్గ‌మ‌ని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here