మెహ్రీన్ మ‌ళ్ళీ ఫామ్ లోకి వ‌చ్చింది..

ఈ మ‌ధ్య సినిమాల విష‌యంలో కాస్త వెన‌క‌డుగు వేసిన మెహ్రీన్.. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో దూసుకొస్తుంది. ఇప్ప‌టికే ఈ ఏడాది పంతంతో వ‌చ్చింది. కానీ ఈ సినిమా వ‌ర్క‌వుట్ కాలేదు. గోపీచంద్ తో పాటు మెహ్రీన్ కు కూడా ఈ సినిమా మ‌రో ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఈమె జోరుకు బ్రేకులు అయితే ప‌డ‌టం లేదు.

Mehreen Pirzada

ప్ర‌స్తుతం సెన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో నోటా.. నితిన్-వెంకీ కుడుముల సినిమా.. వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాల్లో హీరోయిన్ గా న‌టిస్తుంది. దాంతో పాటే ఈ మ‌ధ్యే సుధీర్ బాబు కొత్త సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్సైంది మెహ్రీన్. పులివాసు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాతో పాటు ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఈమెకు వ‌చ్చింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తున్న సినిమాలో మెహ్రీన్ ఓ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇప్పుడు షూటింగ్ లో కూడా అడుగు పెట్టింది. హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇందులో మెహ్రీన్ తో పాటు కాజ‌ల్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. నాలుగు సినిమాలు చేస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఈమె కెరీర్ డేంజ‌ర్ లోనే ఉంది. ఇందులో ఏది హిట్టైనా కూడా మ‌ళ్లీ సేఫ్ జోన్ కు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇలా వేచి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here