జ‌య‌హో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మెగా హీరోల‌కు ఇదే ప‌ని..

ఏదేశ‌మేగినా.. ఎందుకాలిడినా పొగ‌డ‌రా నీ త‌ల్లి భూమి భార‌తిని అన్న‌ట్లుగా.. ఇప్పుడు మెగా హీరోలు ఎక్క‌డికి వెళ్లినా కూడా పొగ‌డ‌రా నీ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అన్న‌ట్లు మారిపోయింది ప‌రిస్థితి. ఎక్క‌డికి వెళ్లినా కూడా వాళ్ల‌కు ఎదురు ప‌డుతున్న ప్ర‌శ్న పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Mega Heroes Support Pawan kalyan

వాళ్లు నోరు విప్పి మాట్లాడితే అందులో ముందు ప‌వ‌న్ పేరు కావాలంటున్నారు అభిమానులు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. రెడు రోజుల్లో ముగ్గురు మెగా హీరోల‌కు ఈ తంటాలు త‌ప్ప‌లేదు. అవి కూడా తీపి తంటాలే. డిసెంబ‌ర్ 17న జ‌రిగిన పడి ప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ వేడుక లో ప‌వ‌న్ గురించి చెప్పాలంటూ అల్లు అర్జున్ తో ఆడుకున్నారు ఫ్యాన్స్. ఆయ‌న కూడా ఒక‌ప్ప‌ట్లా చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అన‌కుండా చెప్తాను బ్ర‌ద‌ర్ అన్నాడు.

ఇక వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం ప్రీ రిలీజ్ వేడుక‌లో బాబాయ్ గురించి చెప్పాడు. త‌న‌కు చ‌ర‌ణ్ లోనే త‌న‌కు చిరు, ప‌వ‌న్ క‌నిపిస్తార‌ని చెప్పాడు వ‌రుణ్ తేజ్. రామ్ చ‌ర‌ణ్ అయితే బాబాయ్ గురించి మరింత గొప్ప‌గా చెప్పాడు. మీరు స్టేజ్ కు అటువైపు ఉండి అరుస్తున్నారు.. మేం ఇటువైపు ఉండి సైలెంట్ గా కంట్రోల్ చేసుకుంటున్నాం అంతే తేడా అనేసాడు. ఆయ‌న స్పీచ్ లు వింటుంటే గుండెలు చించుకుని అర‌వాలి అనిపిస్తుంద‌ని చెప్పాడు చ‌ర‌ణ్. ఆయ‌న మాట‌లు న‌మ్మి అంత‌మంది న‌డుస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని చెప్పాడు మెగా ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి ఇప్పుడు మెగా కుటుంబానికి ప‌వ‌ర్ స్టార్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here