మ‌ణిర‌త్నం మ‌ళ్లీ అదే చేస్తున్నాడా..?

చెలియా ఫ్లాప్ త‌ర్వాత మ‌ణిర‌త్నం మొన్నీమ‌ధ్యే మ‌రోసారి చెక్క చెవంత వానంతో స‌త్తా చూపించాడు. ఈ చిత్రం తెలుగులో న‌వాబ్ గా వ‌చ్చింది. ఇక్క‌డ ఫ్లాప్ అయినా కూడా త‌మిళ‌నాట మాత్రం బాగానే ఆడింది. అక్క‌డ శింబు, విజ‌య్ సేతుప‌తి, అరుణ్ విజ‌య్, అర‌వింద్ స్వామి లాంటి వాళ్లు ఉండ‌టంతో బాగానే ఆద‌రించారు ప్రేక్ష‌కులు. ఈ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాకు ప్రేక్ష‌కులు కూడా ఫిదా అయిపోయారు.

Mani Ratnam to Join hands with vijay

ఇక ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ ఇచ్చిన ఉత్సాహంలో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు మ‌ణి. ఈ సారి ఏకంగా విజ‌య్ తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో విక్ర‌మ్, శింబు కూడా ఉండ‌బోతున్నార‌ని తెలుస్తుంది. మ‌ణిర‌త్నంపై ఉన్న న‌మ్మ‌కంతో విజ‌య్ కూడా క‌థ సిద్ధం చేయండి.. త‌ర్వాత మాట్లాడ‌తాం అన్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం కింగ్ ఆఫ్ కోలీవుడ్ గా మారిపోయాడు విజ‌య్.

ఆయ‌న సినిమా చేస్తే రికార్డులే అన్న‌ట్లుందిప్పుడు ప‌రిస్థితి. ఈ స‌మ‌యంలో విజ‌య్ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. కానీ చేస్తున్నాడు మ‌ణిర‌త్నం. ఆయ‌న‌కు కూడా ఏదీ అసాధ్యం కాదు. అనుకుంటే కానిది ఏమున్న‌ది అనుకునే టైప్ మ‌ణిర‌త్నం. క‌చ్చితంగా ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ చేయాల‌ని చూస్తున్నాడు. అన్నీ కుదిర్తే ఈ సినిమా వ‌చ్చే ఏడాది జూన్ నుంచి మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఆ లోపు అట్లీకుమార్ సినిమా కూడా పూర్తి చేస్తాడు విజ‌య్. మ‌రోవైపు విక్ర‌మ్ ఎలాగూ మ‌ణిర‌త్నంకు ఆప్తుడే.. అడిగితే ఎప్పుడైనా డేట్స్ ఇస్తాడు. శింబు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు స‌మ‌స్యంతా విజ‌య్ తోనే. ఆయ‌న ఒప్పుకుంటే మ‌రో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధ‌మైపోయిన‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here