బాహుబ‌లిని టార్గెట్ చేసిన మ‌ణిర‌త్నం..

సౌత్ ఇండియాలోనే కాదు.. ఇప్పుడు ఇండియ‌న్ సినిమాల్లోనే అంద‌రు ద‌ర్శ‌కుల దృష్టి బాహుబ‌లిపై ప‌డింది. ఆ సినిమాను కొడితే దెబ్బ‌కు నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు అయిపోవ‌చ్చ‌ని అంద‌రి ఆశ‌. అందుకే అంతా అదే చేయాల‌నుకుంటున్నారు.. కాని చేయ‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే శంక‌ర్ 2.0తో దెబ్బ తిన్నాడు.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ తో అమీర్ ఖాన్ బొక్క‌బోర్లా ప‌డ్డాడు.. పులితో విజ‌య్ కింద ప‌డ్డాడు.. ఇలా ఎవ‌రు బాహుబ‌లిని టార్గెట్ చేసినా కూడా నిరాశే మిగులుతుంది. అయితే ఇప్పుడు మ‌ణిర‌త్నం కూడా ఇదే చేయ‌బోతున్నాడు. చెలియా ఫ్లాప్ త‌ర్వాత మ‌ణిర‌త్నం మ‌రోసారి చెక్క చెవంత వానంతో స‌త్తా చూపించాడు. ఈ చిత్రం తెలుగులో న‌వాబ్ గా వ‌చ్చింది. ఇక్క‌డ ఫ్లాప్ అయినా కూడా త‌మిళ‌నాట మాత్రం బాగానే ఆడింది.

Mani Ratnam is Back With Nawab Movie

అక్క‌డ శింబు, విజ‌య్ సేతుప‌తి, అరుణ్ విజ‌య్, అర‌వింద్ స్వామి లాంటి వాళ్లు ఉండ‌టంతో బాగానే ఆద‌రించారు ప్రేక్ష‌కులు. ఈ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాకు ప్రేక్ష‌కులు కూడా ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ ఇచ్చిన ఉత్సాహంలో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు మ‌ణి. ఈ సారి ఏకంగా విజ‌య్ తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో విక్ర‌మ్, శింబు కూడా ఉండ‌బోతున్నార‌ని తెలుస్తుంది.

Mani Ratnam to Join hands with vijay

మ‌ణిర‌త్నంపై ఉన్న న‌మ్మ‌కంతో విజ‌య్ కూడా క‌థ సిద్ధం చేయండి.. త‌ర్వాత మాట్లాడ‌తాం అన్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం కింగ్ ఆఫ్ కోలీవుడ్ గా మారిపోయాడు విజ‌య్. ఆయ‌న సినిమా చేస్తే రికార్డులే అన్న‌ట్లుందిప్పుడు ప‌రిస్థితి. ఈ స‌మ‌యంలో విజ‌య్ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. కానీ చేస్తున్నాడు మ‌ణిర‌త్నం.ఆయ‌న‌కు కూడా ఏదీ అసాధ్యం కాదు. అనుకుంటే కానిది ఏమున్న‌ది అనుకునే టైప్ మ‌ణిర‌త్నం.

క‌చ్చితంగా ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ చేయాల‌ని చూస్తున్నాడు. అన్నీ కుదిర్తే ఈ సినిమా వ‌చ్చే ఏడాది జూన్ నుంచి మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఆ లోపు అట్లీకుమార్ సినిమా కూడా పూర్తి చేస్తాడు విజ‌య్. మ‌రోవైపు విక్ర‌మ్ ఎలాగూ మ‌ణిర‌త్నంకు ఆప్తుడే.. అడిగితే ఎప్పుడైనా డేట్స్ ఇస్తాడు. శింబు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు స‌మ‌స్యంతా విజ‌య్ తోనే. ఆయ‌న ఒప్పుకుంటే మ‌రో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధ‌మైపోయిన‌ట్లే. ఈ ముగ్గురు కానీ క‌లిసి సినిమా చేస్తే బాహుబ‌లి రికార్డులు కూడా క‌దిలిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here