మ‌ణిర‌త్నం బ్యాక్ విత్ ఏ గ్యాంగ్..

కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను ఎప్పుడూ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. అందులోనూ మ‌ణిరత్నం లాంటి లెజెండ్స్ ను. ఇప్పుడు కొంద‌రు ఇదే చేసి నాలుక క‌ర్చుకుంటున్నారు. మ‌ణిర‌త్నంలో స్ట‌ఫ్ అయిపోయింద‌ని.. ఆయ‌న సినిమాలు ఇంక మానేయ‌డం మంచిద‌ని ఉచిత స‌ల‌హాలు కూడా ఇచ్చారు. అయితే అంద‌రికీ ఇప్పుడు ఒక్క సినిమాతో స‌మాధానం ఇస్తున్నాడు మ‌ణి.

Mani Ratnam is Back With Nawab Movie

అదే న‌వాబ్.. ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ అయితే రాలేదు కానీ క‌చ్చితంగా కొన్నేళ్ల‌లో మ‌ణిర‌త్నం నుంచి వ‌చ్చిన బెస్ట్ సినిమాల్లో ఇది ఒక‌టి. వ‌ర‌స డిజాస్ట‌ర్స్ తో పిచ్చెక్కిస్తున్న మ‌ణి.. ఇప్పుడు త‌న స్టైల్ నిరూపించుకుంటూ న‌వాబ్ చేసాడు.
వార‌సుల మ‌ధ్య పోరుగా వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది. తెలుగులో త‌క్కువ కానీ త‌మిళ‌నాట అయితే పిచ్చెక్కిస్తున్నాడు నవాబ్.

అక్క‌డ శింబు, విజ‌య్ సేతుప‌తి, అర‌వింద్ స్వామి లాంటి స్టార్స్ ఉండ‌టంతో పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు. ఒక్కోపాత్ర‌ను మ‌ణిర‌త్నం సృష్టించిన తీరు.. వాళ్ల స్వ‌భావం అన్నీ అదిరిపోయాయి. ఇదే సినిమాకు ప్ల‌స్ గా మారింది. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌ణిర‌త్నం ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు కూడా. బాక్సాఫీస్ లెక్క‌లు కూడా సినిమాకు బాగానే చూపిస్తున్నాయి. త‌మిళ‌నాట బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మొత్తానికి కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్నా కూడా గ్యాంగ్ తోనే వ‌చ్చాడు ఈ లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here