బాహుబ‌లిని ఇంకా వ‌ద‌ల‌వా క‌ర‌ణ్ జోహార్..?

బాహుబ‌లి వ‌చ్చి ఏడాదిన్న‌ర అయిపోయిన కూడా ఇప్ప‌టికీ క‌ర‌ణ్ జోహార్ మాత్రం బాహుబ‌లి యూనిట్ ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న ఎలాగోలా వాళ్ల‌ను వాడేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా బాహుబ‌లి టీంను కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ఆహ్వానించాడు. త్వ‌ర‌లోనే ఈ షో ప్రసారం కానుంది.

Make Ready for baahubali coffee

ఇందులో ప్ర‌భాస్, రానాతో పాటు రాజ‌మౌళి కూడా ఉన్నాడు. చాలా విష‌యాల‌పై కాఫీ విత్ క‌ర‌ణ్ లో మాట్లాడుకున్నారు ఈ ముగ్గురు. ముఖ్యంగా రానాతో బాగా ఆడుకున్నాడు క‌ర‌ణ్ జోహార్. ముందు నుంచి ఉన్న సాన్నిహిత్యంతో ఇద్ద‌రూ చాలా విష‌యాలు చ‌ర్చించుకున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ అంటే ఓపెన్ గా కొన్ని విష‌యాల‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడు ఇందులోనే ప్ర‌భాస్ పెళ్లితో పాటు రానా పెళ్లి గురించి కూడా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి.

రాజ‌మౌళి త‌న బాహుబ‌లి ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉందో ఈ షోలో మ‌రోసారి చెప్ప‌బోతున్నాడు. ఇది ప్ర‌సారం అయిన త‌ర్వాత బాలీవుడ్ తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా మ‌రోసారి బాహుబ‌లి హాట్ టాపిక్ కావ‌డం ఖాయం. ఇప్పుడు సాహో సినిమాకు కూడా ఇది ప్ర‌మోష‌న్ గా హెల్ప్ కానుంది. మ‌రి చూడాలిక‌.. కాఫీ విత్ క‌ర‌ణ్ లో బాహుబ‌లి టీం ఏమేం ముచ్చ‌ట్లు చెప్పారో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *