మ‌హేశ్ బాబుతో సుకుమార్ అలాంటి సినిమా..

అలాంటి సినిమా అంటే తేడాగా అనుకోవ‌ద్దు.. సుకుమార్ ఏం చేసినా కూడా కొత్త‌గానే ఉంటుంది. రంగ‌స్థ‌లం లాంటి పాత క‌థ‌ను కూడా ఆయ‌న కొత్త కొత్త‌గా తీయ‌గ‌ల‌డు. కెరీర్ లో ఒక్క‌సారి అన్ని ప‌క్క‌న‌బెట్టి ప‌క్క‌గా రివేంజ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీస్తే అది కాస్తా రికార్డులు తిర‌గ‌రాసింది. అది సుక్కు రేంజ్.

Mahesh babu Sukumar

ఆయ‌న్ని న‌మ్మితే అలాంటి విజ‌యాలు అందిస్తాడు. అర్థం కాని లెక్క‌లు వేసుకున్నన్ని రోజులు కూడా సుకుమార్ ప్రేక్ష‌కుల‌కు అర్థం కాలేదు. కానీ ఆయ‌న సీదా లెక్క చెబితే ఏకంగా 125 కోట్ల షేర్ వ‌చ్చింది. దాంతో ఇప్పుడు మ‌హేశ్ బాబుతో ఈయ‌న ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం నేనొక్క‌డినే త‌ర్వాత ఈయ‌నతో మ‌రోసారి విభిన్న‌మైన క‌థ‌నే తీయ‌నున్నాడు.

ఈ సారి స్వాతంత్ర్యం త‌ర్వాత ఉన్న దేశంలో ఓ క‌థ‌ను ప‌ట్టుకుని క‌థ‌గా రాసుకున్నాడు సుకుమార్. ఇదే క‌థ‌ను ఇప్పుడు మ‌హేశ్ బాబుకు చెప్పి ఒప్పించి తెర‌పైకి తెచ్చే క్ర‌మంలో ఉన్నాడు. ఈ చిత్రం డిసెంబ‌ర్ నుంచి అనుకున్నారు కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్పుడు మ‌హేశ్ న‌టిస్తున్న మ‌హ‌ర్షి జ‌న‌వ‌రి నాటికి పూర్తి కానుంది. మొత్తానికి మ‌హేశ్ తో స్వాతంత్ర క‌థ అంటే కాస్త కొత్త‌గానే ఉంటుంది. కానీ సుకుమార్ దాన్ని క‌చ్చితంగా ఏదో ఓ మాయ చేస్తాడ‌నే న‌మ్మ‌కం కూడా ఉంది. మ‌రి చూడాలిక‌.. వ‌న్ గాయాన్ని ఈ చిత్రంతో మాన్పిస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here