అమీర్ సినిమాతో మ‌హేష్ మ‌ల్టీప్లెక్సులు షురూ..

అవును.. ఇన్నాళ్లూ హీరోగానే చూసిన మ‌హేశ్ బాబు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా కూడా మారిపోయాడు. ఈయ‌న గురించి ముందే ఊహించాడేమో పూరీ జ‌గ‌న్నాథ్.. అందుకే ఐదేళ్ల ముందే బిజినెస్ మ్యాన్ సినిమా సూప‌ర్ స్టార్ తో చేసాడు పూరీ. ఇప్పుడు ఈ టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇటు సినిమాలు.. అటు బిజినెస్ లో దూసుకెళ్తున్నాడు సూప‌ర్ స్టార్.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌ని చెప్పిన మ‌హేశ్.. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఏషియ‌న్ ఫిల్మ్ ఓన‌ర్ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు మ‌ల్టీప్లెక్సుల‌కు ఉన్న ఆద‌ర‌ణ చూసిన మ‌హేశ్.. ఇందులో 150 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌చ్చిబౌలి ఓపెన్ స్థ‌లాల్లో ఈ మ‌ల్టీప్లెక్సుల నిర్మాణం జ‌రుగుతుంది.

Mahesh Babu

ఇప్పుడు ఇది పూర్తైపోయి..న‌వంబ‌ర్ 8న ఓపెనింగ్ కూడా అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతోనే ఈ మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ అవుతుంద‌ని తెలుస్తుంది. ఆరు భారీ స్క్రీన్లు ఉండేలా ఈ మ‌ల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి AMB స్క్రీన్స్ అనే పేరు పెడుతున్నారు. మ‌రోవైపు మ‌ల్టీప్లెక్సులే కాదు.. కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు.

ఇప్ప‌టికే తాను చాలా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఇందులోనే ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ ల‌తో పాటు మ‌రికొన్ని బిజినెస్ ల‌పై కూడా మ‌హేశ్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మ‌రోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here