మ‌హ‌ర్షి అప్పుడే బ‌య్య‌ర్ల‌తో ఆట మొద‌లుపెట్టాడా…

మ‌హేష్ బాబు సినిమా అంటే అంచ‌నాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక దానికితోడు సూప‌ర్ స్టార్ 25వ సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఆ మ‌ధ్య రోజుకో కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసి ఆస‌క్తి పెంచేసాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. పైగా అందులో కొన్ని హింట్లు కూడా ఇచ్చాడు.

Mahesh babu Maharshi USA rights Isuues

ఇంట్రెస్టింగ్.. రైజింగ్.. సూప‌ర్ స్టార్.. ల‌వింగ్ అంటూ చూపించి రిషి అనే ప‌దాన్ని హైలైట్ చేసి మ‌హ‌ర్షిని ప‌రిచ‌యం చేసాడు. ఇందులో ఫారెన్ నుంచి ఇండియాకు వ‌చ్చిన కంపెనీ సిఈఓగా ఇందులో న‌టిస్తున్నాడు మ‌హేశ్. ఆ మ‌ధ్య మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాల‌ర్ ఎగ‌రేస్తూ న‌డిచొస్తున్న మ‌హేశ్ ను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. పైగా మీసాల‌తో మ‌రింత కొత్త‌గా ఉన్నాడు సూప‌ర్ స్టార్.

రైతు స‌మ‌స్య‌ల ఆధారంగా సినిమా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రుగుతుంది. అల్ల‌రి న‌రేష్ కూడా ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 25వ సినిమా కావ‌డంతో ద‌ర్శ‌కుడు కూడా ఫ‌స్ట్ లుక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర బిజినెస్ విష‌యంలో అస‌లు ర‌చ్చ మొద‌లైంది. ఓవ‌ర్సీస్ హ‌క్కుల విష‌యంలో చుక్క‌లు చూపిస్తున్నారు అని తెలుస్తుంది.

ఏకంగా 25 కోట్లు బేరం పెట్ట‌డంతో అక్క‌డి బ‌య్య‌ర్లు భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ని తెలుస్తుంది. ఎందుకంటే భ‌ర‌త్ అనే నేను 3.4 మిలియ‌న్ వ‌చ్చినా కూడా కొన్ని చోట్ల న‌ష్టాలు త‌ప్ప‌లేదు. దాంతో ఇప్పుడు 25 కోట్లు అంటే ఏకంగా 5 మిలియ‌న్ రావాలి. అంత వ‌స్తే కానీ సేఫ్ కాదు. దానికితోడు ఇక్క‌డ కూడా బిజినెస్ ఇలాగే చేస్తున్నారు.3

భ‌ర‌త్ అనే నేను 95 కోట్ల వ‌ర‌కు షేర్ తీసుకొచ్చినా కూడా యావ‌రేజ్ గానే మిగిలిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దానికి కార‌ణం 99 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయ‌డం. మ‌రి ఇప్పుడు మ‌హ‌ర్షికి ఏమ‌వుతుందో చూడాలి. 2019 ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తుంది. దిల్ రాజు, పివిపి, అశ్వినీద‌త్ నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here