హిందీలోకి మ‌హాన‌టి.. నిజ‌మేనా..?

మ‌హాన‌టి.. మ‌న ఆస్తి. సావిత్రమ్మ జీవితం మ‌న‌కు తెరిచిన పుస్త‌కం. ఇప్పుడు ఆమె జీవితం కూడా అద్భుత‌మే. క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు.. అవార్డుల ప‌రంగా కూడా మ‌హాన‌టి సంచ‌ల‌నం సృష్టించింది. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం తెలుగులో కొత్త ట్రెండ్ కు తెర‌తీసింది. ఇప్పుడు ఇదే దారిలో మ‌రిన్ని బ‌యోపిక్ లు కూడా సిద్ధం అవుతున్నాయి.

Mahanati In Hindi Remake

ఏడేళ్లుగా పాతాళంలో ఉన్న అశ్వీనీద‌త్ ఈ ఒక్క సినిమాతో మ‌ళ్లీ పైకి లేచాడు.. లేని నిల‌బ‌డి మ‌హేశ్, నాగార్జున‌, నాని లాంటి స్టార్ హీరోల‌తో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పుడు మ‌హాన‌టి సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌నే స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఇక్క‌డ బేర‌సారాలు న‌డుపుతున్న‌ది కూడా మ‌రెవ‌రో కాదు ఆదిత్యా చోప్రా. ఆయ‌న య‌శ్ రాజ్ బ్యాన‌ర్ లో మ‌హాన‌టి సినిమాను రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడు. అందుకే ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల కోసం అడుగుతున్నాడ‌ని తెలుస్తుంది. సావిత్రి అంటే నార్త్ ఇండ‌స్ట్రీలో కూడా గుర్తింపు ఉంది. అక్క‌డ కూడా ఆమె న‌టించింది.

దాంతో మ‌హాన‌టిని హిందీకి తీసుకెళ్లాల‌ని ఆలోచిస్తున్నాడు ఆదిత్య చోప్రా. మొత్తానికి సావిత్రి చివ‌రి రోజుల్లో ఏమీ లేకుండా చ‌నిపోయింది అంటున్నారు కానీ.. ఆమె కోల్పోయిందంతా ఇప్పుడు అశ్వినీద‌త్ కు ఇచ్చేసి వెళ్లింది. ఆమెను న‌మ్ముకున్నాడు కాబ‌ట్టి మ‌ళ్లీ డ‌బ్బులు సంపాదించి పెట్టింది. క‌లెక్ష‌న్ల రూపంలో 43 కోట్లు వ‌చ్చాయి. శాటిలైట్.. డిజిట‌ల్ క‌లిపి 20 కోట్లు వ‌చ్చేసాయి. ఇప్పుడు రీమేక్ రైట్స్ అంటే మ‌రో 5 కోట్లు ఈజీగా వ‌చ్చేస్తాయి. ఒక్క సినిమాతో వై జ‌యంతి పంట పండేసిందిగా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here