కీర్తి అందుకు ఒప్పుకుందా.. సామి కోసం సెగ‌లు..

అందంగా క‌నిపించ‌డం అంటే కేవ‌లం అందాలు ఆర‌బోయ‌డమేనా..? ఎక్స్ పోజింగ్ చేయ‌క‌పోతే అందంగా క‌నిపించ‌న‌ట్లేనా..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అంద‌రూ అనుకుంటున్న మాట ఇదే. కానీ ఇది త‌ప్ప‌ని కొంద‌రు ముద్దుగుమ్మ‌లు నిరూపిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి ఏం చూపిస్తుంద‌ని స్టార్ గా మారిపోతుంది.. నివేదా థామ‌స్ ఎక్స్ పోజింగ్ చేస్తుందా.. అంతెందుకు కీర్తిసురేష్ క‌నీసం న‌డుము అయినా చూపిస్తుందా..?

అయినా కానీ స్టార్ హీరోయిన్ కాలేదా..? మ‌రీ ముఖ్యంగా కీర్తిసురేష్ అయితే కేవ‌లం క‌ళ్ళ‌తోనే చంపేస్తుంది. మిగిలిన వాళ్లు బికినీ వేసినా కూడా ఆ మ‌త్తు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ కీర్తి క‌ళ్ల‌లోనే ఏదో మాయ ఉంది. కీర్తిసురేష్ అందాలు ఆర‌బోయ‌దు.. ఎక్స్ పోజింగ్ చేయ‌దు.. కానీ మోడ్ర‌న్ డ్ర‌స్సులేస్తుంది.. చూపుల‌తోనే చంపేస్తుంది.. ఇదే ఇన్నాళ్లూ ఉన్న లెక్క‌.

keerthy suresh swamy trailer
keerthy suresh swamy trailer

ఇప్పుడు ఈమె కూడా మారిపోయింది. తాజాగా సామి 2 సినిమా కోసం కీర్తిసురేష్ మ‌తులు చెడ‌గొట్టింది. కెరీర్ లో తొలిసారి హాట్ థైస్ చూపిస్తూ రెచ్చ‌గొట్టింది కీర్తిసురేష్. అస‌లు ఈమె తెగింపు చూసి త్వ‌ర‌లోనే కీర్తి కూడా అంద‌రి హీరోయిన్ల మాదిరే గ్లామ‌ర్ షోలో కుమ్మేయ‌డం ఖాయం అనిపిస్తుంది. ఇక్క‌డున్న పోటీ త‌ట్టుకోవాలంటే ఇవ‌న్నీ త‌ప్ప‌వు అన్న‌ట్లు ఫిక్సైపోయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాట విక్ర‌మ్ సామి 2.. విశాల్ పందెంకోడి 2తో పాటు విజ‌య్ స‌ర్కార్ సినిమాలో న‌టిస్తుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన సామి 2 ట్రైల‌ర్లో అమ్మ‌డు ఫుల్లుగా ర‌చ్చ చేసింది. మోడ్ర‌న్ డ్ర‌స్సులు వేసి చూపించకుండానే రెచ్చ‌గొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఇండ‌స్ట్రీలో ఉండాలంటే అందాలు ఆర‌బోయ‌క త‌ప్ప‌ద‌ని అర్థం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here