కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్.. ప‌వ‌న్ తో క‌లిసి ఇస్తున్నాడా..?

ఏమో ఇప్పుడు ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి అంద‌ర్లోనూ. ఎందుకంటే తాను కూడా ఏపి రాజ‌కీయాల్లో అడుగు పెడ‌తాన‌ని.. అక్క‌డ తెలంగాణ పార్టీ కూడా క్రియాశీల‌కం కానుంద‌ని చెప్పాడు కేసీఆర్. అస‌లు తెలంగాణ‌కు అక్క‌డేంటి ప‌ని అనుకుంటున్న వాళ్లు కూడా లేక‌పోలేరు.

KCR and pawan kalyan return gift to Naidu

 

అయితే మ‌రి తెలుగుదేశంకు ఇక్క‌డేంటి ప‌ని అని కేసీఆర్ కూడా అడుగుతున్నాడు. చంద్ర‌బాబు వ‌చ్చి త‌న ద‌గ్గ‌ర వేలు పెట్టిన‌పుడు తాను కూడా వెళ్లి అక్క‌డ స‌త్తా చూపించాలి క‌దా అంటున్నారు ఈయ‌న‌. ముఖ్యంగా తాను బాబుకు ఇవ్వ‌బోయే రిట‌ర్న్ గిఫ్ట్ క‌చ్చితంగా కోలుకోలేని విధంగా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈ గులాబి ద‌ళ‌ప‌తి. ఈ మాటలే రాజ‌కీయ ప‌రంగానూ హాట్ టాపిక్ గా మారిపోయాయి. కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేది ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి అని ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఎలాగూ జ‌గ‌న్ తో కేసీఆర్ కు స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి.

ఇప్పుడు ప‌వ‌న్ ను కూడా కేసీఆర్ క‌లుపుకుపోవాల‌ని చూస్తున్నాడు. వీలైతే జ‌న‌సేన‌కు టీఆర్ఎస్ అండ‌గా ఉంటుంద‌ని.. వాళ్లు స‌పోర్ట్ చేస్తార‌ని కూడా తెలుస్తుంది. ఏం చేసైనా కూడా చంద్ర‌బాబును మ‌రోసారి గెల‌వ‌కుండా ఆపాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌లా క‌నిపిస్తుంది. పైగా వైఎస్ఆర్సీపీతో కూడా కేసీఆర్ దోస్తీ క‌ట్టాల‌ని చూస్తున్నాడు. ఎలాగైతే తెలంగాణ‌లో త‌న‌ను ఓడించాడ‌ని కూట‌మి క‌ట్టారో.. అలాగే అక్క‌డ తెలుగుదేశంను ఓడించాల‌ని తెలివైన కూటమి క‌ట్టాల‌ని చూస్తున్నాడు కేసీఆర్. ఇక్క‌డ బాబు చేసిన త‌ప్పులు అక్క‌డ తాను రిపీట్ చేయ‌నంటున్నాడు గులాబీ ద‌ళ‌ప‌తి.

క‌చ్చితంగా త‌ను ఆంధ్రా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతానంటున్నాడు. ఈ స‌మ‌యంలోనే జ‌న‌సేన‌తో జ‌ట్టు క‌ట్టాల‌నుకుంటున్నాడు కేసీఆర్. ప‌వ‌న్ స‌హ‌క‌రిస్తే ఓకే.. లేదంటే జ‌గ‌న్ తో క‌లిసి వెళ్లేలా క‌నిపిస్తున్నాడు. ఏం చేసినా కూడా ఇప్పుడు ప‌వ‌న్ పేరు మాత్రం ఆంధ్రా రాజ‌కీయాల్లో కీల‌కంగా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here