జ‌య‌హో కౌశ‌ల్.. బిగ్ బాస్ విన్నర్ ఇత‌గాడే..!

ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు కొత్త‌గా మ‌ళ్లీ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.. బిగ్ బాస్ హిస్ట‌రీలోనే ఏ కంటెస్టెంట్ కు లేని ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు కౌశ‌ల్ కు వ‌చ్చింది. ఎప్ప‌ట్నుంచో చెబుతున్న‌ట్లే ఇప్పుడు కౌశ‌ల్ ను గెలిపించేసార‌ని తెలుస్తుంది.

Kaushal-Army-Waiting-For-Big-Boss2-Title-Winner

ఇక అఫీషియ‌ల్ గా కౌశ‌ల్ విన్న‌ర్ అని నాని ప్ర‌క‌టించ‌డం ఒక్క‌టే త‌రువాయి. అనామ‌కుడిగా మొద‌లై.. అసాధ్యుడిగా ఎదిగిన కౌశ‌ల్ ప్ర‌యాణం అద్భుత‌మే. తొలిరోజు నుంచే గేమ్ ను గేమ్ లా ఆడ‌టం అల‌వాటు చేసుకున్నాడు కౌశ‌ల్. ఇదే ఆయ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్షగా నిలిచింది కూడా.

అదే ఆయ‌న‌కు ప్రేక్ష‌కుల్లో అభిమానాన్ని పెంచేసింది. ఫైన‌ల్ లో కౌశ‌ల్ కు 39 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది. ఆయ‌న త‌ర్వాత రెండో స్థానం కోసం పోటీ ప‌డిన గీతామాధురికి కోటిన్న‌ర ఓట్లు వ‌చ్చాయి. దీన్నిబ‌ట్టే కౌశ‌ల్.. మిగిలిన వాళ్ల‌కు మ‌ధ్య తేడా ఏంటో తెలిసిపోతుంది. ఈయ‌న దూకుడు చూస్తుంటే బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కెరీర్ కాస్త ప్లాన్ చేసుకుంటే టాప్ లోకి వెళ్ల‌డం ఖాయం. ఇప్ప‌టికే బోయ‌పాటి-బాలయ్య సినిమాలో కౌశ‌ల్ ని విల‌న్ గా తీసుకున్నారు అనే టాక్ గ‌ట్టిగానే న‌డుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ బిగ్ బాస్ విన్న‌ర్ ఇంటి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత ఏం చేస్తాడో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here