దేవ‌దాస్ ప‌రిస్థితి ఏంటి..?

దేవ‌దాస్ విడుద‌లైంది.. టాక్ కూడా బాగానే వ‌చ్చింది.. కానీ బిజినెస్ మాత్రం భారీగా జ‌రిగింది. నాని, నాగార్జున లాంటి స్టార్ హీరోలు ఉండ‌టంతో ఏకంగా 40 కోట్ల బిజినెస్ చేసారు నిర్మాత‌లు. ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉన్నార‌నే ధైర్యంతో బ‌య్య‌ర్లు కూడా ధైర్యంగానే సినిమాను కొనేసారు. ఇకిప్పుడు సినిమాకు టాక్ కూడా బాగానే వ‌చ్చింది. అయితే వారం రోజుల్లోనే ఇంత మొత్తం తీసుకొచ్చే స‌త్తా ఈ సినిమాకు ఉందా అనేది అంద‌ర్లోనూ వ‌స్తున్న అనుమానం. ఇంత మొత్తం రావాలంటే తొలిరోజే క‌చ్చితంగా సూప‌ర్ టాక్ తెచ్చుకోవాలి.

DEVADAS

కానీ సూప‌ర్ హిట్ కాదు కానీ ప‌ర్లేద‌నే టాక్ వ‌చ్చింది. ఎంత స్టార్ హీరోలున్నా కూడా టాక్ బాగా రాక‌పోతే నిర్దాక్ష‌ణ్యంగా తిప్పి కొడుతున్నారు జ‌నాలు. దేవ‌దాస్ విష‌యంలో ఆ టెన్ష‌న్ అవ‌స‌రం లేదు. దీనికి టాక్ బాగుంది కానీ ఈ టాక్ తో ఎంత‌దూరం లాక్కెళ్తుంది అనేది తెలియ‌డం లేదు. గురువారం విడుద‌ల కావ‌డంతో ఓపెనింగ్స్ కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి. అయితే వీకెండ్ నాటికి అంతా సెట్ అయిపోతుంద‌ని న‌మ్ముతున్నాడు నిర్మాత అశ్వినీద‌త్.

మ‌రోవైపు నాని, నాగార్జున మాత్రం ఈ సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని.. ప్రేక్ష‌కులు ప‌డీ ప‌డీ న‌వ్వుకుంటార‌ని చెబుతున్నారు. ఈ సినిమాను నైజాంలో 11 కోట్ల‌కు అమ్మారు.. ఇక ఓవ‌ర్సీస్ లో 4.50 కోట్లకు అమ్మేసారు. అక్క‌డ 180 లొకేష‌న్స్ లో విడుద‌లైంది ఈ చిత్రం. అక్క‌డ్నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వ‌చ్చింది. ఇప్పుడు దేవ‌దాస్ ల‌క్ష్యం చాలా సింపుల్.. 40 కోట్లు వ‌స్తే సినిమా హిట్.. అంత‌కంటే త‌క్కువ‌గా వ‌స్తే ఫ‌స‌క్. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here