మ‌ణిక‌ర్ణిక‌పై కంగ‌న ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

మణికర్ణిక సినిమాకు కంగనారనౌత్ ఏ ముహూర్తంలో ఓకే చెప్పిందో తెలియదు కానీ అప్పటి నుంచి వివాదాలు ఈ సినిమాను వెంటాడుతూనే ఉన్నాయి. క్రిష్ కూడా ఈ సినిమా మధ్యలో నుంచి బయటికి వచ్చేశాడు. షూటింగ్ మొత్తం తానే పూర్తి చేసినా కూడా క్రెడిట్ మాత్రం తీసుకోడానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు క్రిష్‌.

Kangana Ranaut Comments on Manikarnika Movie

చివర్లో రీషూట్ చేయాల్సిన సీన్స్ అన్నీ తానే చేసుకుంది కంగనా రనౌత్. షూటింగ్ 80% తానే దర్శకత్వం వహించాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు కంగనా రనౌత్ విప‌రీత చేష్టలు తట్టుకోలేకే ఈ సినిమా నుంచి క్రిష్ బయటికి వచ్చాడనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు సినిమా నుంచి క్రిష్ మాత్రమే కాదు సోనూసూద్ మరో నటి కూడా బయటకు వచ్చింది. దీనికి కూడా కారణం కంగనా రనౌత్ అని బాలీవుడ్ లో గుసగుసలు ఉన్నాయి.

ప్రతి ఒక్కరిని కూడా తనకు నచ్చినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ సినిమా నుంచి వాళ్ళందరూ బయటకి వచ్చారు. దాని వెనక కూడా ఒక కారణం ఉంది. మణికర్ణిక నిర్మాతలు కంగనారనౌత్ కు బాగా కావలసిన వాళ్లు. అందుకే ఈ సినిమా విషయంలో తనకు నచ్చినట్టు చేస్తూ వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఈమెతో వ‌చ్చిన‌ క్రియేటివ్ డిఫరెన్స్ ల వల్లే క్రిష్ కూడా సినిమా నుంచి నుంచి బయటికి వచ్చేశాడు.

ఇక ఈ మధ్య విడుదలైన ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్ లో ఉన్న కంగ‌న‌.. సినిమా గురించి చెబుతూ మణికర్ణిక చూసిన తర్వాత తనను విమర్శించిన నోరు మూసుకుపోతాయి అని ధీమాగా చెబుతోంది. ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టాన‌ని.. ఆ కష్టం అంతా రేపు తెరపై మీరే చూస్తారని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. జనవరి 25న మణికర్ణిక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కంగనా రనౌత్ చెప్పినట్లు ఈ సినిమా అదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here