అర్జున్ రెడ్డి మాంచి జోరు మీదున్నాడుగా..

అర్జున్ రెడ్డి అనేది ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్. సినిమా వ‌చ్చి ఏడాది అయిపోయినా కూడా ఇప్ప‌టికీ ఆ హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌టికి రాలేదు ప్రేక్ష‌కులు. ఇక ఇత‌ర ఇండ‌స్ట్రీలు కూడా అర్జంట్ గా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నే తొంద‌ర‌లో ఉన్నారు. ఇప్ప‌టికే త‌మిళ్ లో వ‌ర్మ పేరుతో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బాల అర్జున్ రెడ్డిని విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కృష్ణ‌తో రీమేక్ చేస్తున్నాడు. క ఇప్పుడు హిందీలో సందీప్ రెడ్డి వంగానే రీమేక్ చేస్తున్నాడు.

kabir singh shooting starts

అక్క‌డ షాహిద్ క‌పూర్ హీరోగా ఇది రానుంది. ఈ సినిమా ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కింది.. రెగ్యుల‌ర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి. ప్ర‌స్తుతం ఈ చిత్రంలోని హాస్పిట‌ల్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి మొద‌ట్లోనే ఐస్ వేసుకునే సీన్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సీన్సే చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి. తెలుగుతో పోలిస్తే హిందీలో మ‌రింత బోల్డ్ గా అర్జున్ రెడ్డి తెర‌కెక్కుతుంది. అక్క‌డ ఈ చిత్రానికి క‌బీర్ సింగ్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు.

పైగా రీమేక్ అనేది ఉన్న‌ది ఉన్న‌ట్లు చేయ‌డం లేదని చెబుతున్నాడు సందీప్. తాను మ‌ళ్లీ ఓ కొత్త సినిమా మాదిరే చేస్తున్నాన‌ని చెబుతున్నాడు సందీప్. తెలుగులో మిస్ అయిన చాలా అంశాల‌ను హిందీ అర్జున్ రెడ్డిలో చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదే క్ర‌మంలో ఇప్పుడు హిందీ రీమేక్ లో ఐటం సాంగ్ కూడా ఉంద‌ని తెలుస్తుంది. అస‌లు అర్జున్ రెడ్డి క‌థ‌లో ఐటం సాంగ్ కు స్థాన‌మే లేదు. కానీ ఇప్పుడు సందీప్ ఆ వైపుగా ఆలోచిస్తుండ‌టంతో.. అస‌లు సినిమాను చెడ‌గొట్ట‌డు క‌దా అని కంగారు ప‌డుతున్నారు అభిమానులు. అయినా త‌న క‌థ గురించి తన కంటే ఎవ‌రికి బాగా తెలుసు.. అందుకే సందీప్ అన్ని జాగ్ర‌త్త‌గా బాగానే తీసుకుంటున్నాడు. చూసిన వాళ్ల‌కు ఇది రీమేక్ లా అనిపించ‌ద‌ని.. మ‌ళ్లీ కొత్త సినిమా మాదిరే ఉంటుంద‌నే హామీ ఇస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న తీరు చూస్తుంటే అర్జున్ రెడ్డికి అమ్మ‌మొగుడు లాంటి రీమేక్ అక్క‌డ తీయ‌బోతున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. జూన్ 21, 2019న హిందీలో అర్జున్ రెడ్డి విడుద‌ల కానుంది. టీ సిరీస్ భూష‌న్ కుమార్ మ‌రో ముగ్గురు నిర్మాత‌ల‌తో క‌లిసి దీన్ని నిర్మిస్తున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here