విజ‌యం సాధించిన త‌ర్వాతే ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లైంది..

ఏ సినిమా అయినా కూడా విడుద‌లైన త‌ర్వాత విజ‌యం సాధిస్తుంది.. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ మాత్రం విజ‌యం సాధించిన త‌ర్వాతే మొద‌లైంది. క‌థానాయ‌కుడు ఆడియో లాంఛ్ లో ఎన్టీఆర్ మాట్లాడిన డైలాగులు ఇవి. ఇప్పుడు ఈ మాట‌లు ట్రెండింగ్ అయిపోయాయి.

Jr Ntr Speech at NTR Biopic Audio Launch

బ‌యోపిక్ ఆడియో వేడుక‌లో ఎన్టీఆర్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. బాబాయ్ ప‌క్క‌నే ఉండ‌టం.. అందులోనూ తాత‌గారి వేషంలో ఉండ‌టంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ బాగా ఎమోష‌న‌ల్ అయ్యాడు. తాత బ‌యోపిక్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని బాబాయ్ చేయ‌లేదు.. ఎందుకంటే విజ‌యం సాధించిన త‌ర్వాతే ఇది మొద‌లైంద‌ని చెప్పాడు. అంతేకాదు.. చ‌రిత్ర‌కు జ‌యాలు అప‌జ‌యాలు ఉండ‌వు అని చెప్పాడు బుడ్డోడు.

తాను ఈ కార్య‌క్ర‌మానికి తెలుగువాడిగా వ‌చ్చాను కానీ ఎన్టీఆర్ కుటుంబీకుడిగా కాదు అని చెప్పాడు ఎన్టీఆర్. మ‌ద్రాస్ రోజుల్లోనే తెలుగువాడు అని చెప్పుకోలేని స‌మ‌యంలోనే ఎన్టీఆర్ తెలుగు వాడి స‌త్తా చూపించాడు అని చెప్పాడు జూనియ‌ర్. ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి, ముందు తరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా సరిపోదంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు ఎన్టీఆర్. రేపు మా పిల్ల‌లు అడిగితే మా తాత గురించి మీ తాత చేసిన చిత్ర‌మిదిరా అని చూపిస్తానంటూ చెప్పాడు ఎన్టీఆర్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here