ఎన్టీఆర్ పాత్ర‌పై క్లారిటీ ఇచ్చిన క్రిష్..

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో్ ఇప్ప‌టికే చాలా మంది న‌టిస్తున్నారు. ఇది మ‌ల్టీస్టార‌ర్ కా బాప్ లా మారిపోయింది. బాల‌కృష్ణ‌తో పాటు క‌ళ్యాణ్ రామ్, సుమంత్, ర‌కుల్, విద్యాబాల‌న్, నిత్యామీనన్.. ఇలా చాలా మంది న‌టిస్తున్నారు. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇందులో న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ntr biopic

న‌టించ‌క‌పోయినా క‌నీసం వాయిస్ ఓవ‌ర్ ఇస్తాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడు దీనిపై క్రిష్ స్పందించాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చేసాడు. అస‌లు జూనియర్ ఈ చిత్రంలో లేడ‌ని.. బాల‌య్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు అని వ‌చ్చిన వార్త‌లు పూర్తిగా అబ‌ద్ధం అని తేల్చేసాడు క్రిష్. ఇప్పుడు ఎవ‌రైతే ఉన్నారో వాళ్ళే బ‌యోపిక్ లో ఉంటారు కానీ అంత‌కుమించి ఒక్క‌రు కూడా అద‌నంగా లేర‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

క్రిష్ మాట‌ల‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగానే నిరాశ ప‌డ్డారు. బాబాయ్, అబ్బాయిల‌ను స్క్రీన్ పై చూడాల‌న్న వాళ్ల కోరిక నెర‌వేర‌లేదు. అయితే మ‌రో అబ్బాయి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తుండ‌టంతో కాస్త హ్యాపీ అవుతున్నారు వాళ్లు. మొత్తానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఎన్టీఆర్ ఉన్నాడా లేదా అనే క‌న్ఫ్యూజ‌న్ కు ఇన్ని రోజుల త‌ర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసాడు క్రిష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *