ద‌స‌రా గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న నాని..

హీరోలు అన్న త‌ర్వాత పండ‌గ‌ల‌కు ప‌బ్బాల‌కు క‌చ్చితంగా అభిమానుల‌కు గిఫ్టులు ఇవ్వాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. అందుకే ఇప్పుడు నాని కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న కూడా ద‌స‌రాకు నెల రోజుల ముందే గిఫ్ట్ ప్యాక్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 27న దేవ‌దాస్ తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్.

nani

నాగార్జున‌ను వెంట‌పెట్టుకుని కామెడీతో ప్రేక్ష‌కుల క‌డుపులు చెక్క‌లు చేయ‌డానికి సై అంటున్నాడు నాని. ఇక దాంతోపాటు త‌ర్వాతి సినిమా ముచ్చ‌ట్లు కూడా చెప్పాడు ఈ హీరో. ఇప్ప‌టికే గౌత‌మ్ తిన్న‌నూరితో ఈయ‌న త‌ర్వాతి సినిమా ఫిక్సైంది. జెర్సీ టైటిల్ తో ఇది తెర‌కెక్క‌బోతుంది. ఇందులో క్రికెట‌ర్ గా న‌టిస్తున్నాడు నాని.

మూడు ర‌కాల పాత్ర‌ల్లో ఇందులో క‌నిపించ‌బోతున్నాడు. కుర్రాడు.. యుక్త వ‌య‌సు.. మ‌ధ్య వ‌య‌స్కుడిగా ఇందులో న‌టిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇన్నాళ్లూ ఈ సినిమా ఎప్పుడు మొద‌లువుతుందా అనే టెన్ష‌న్ ఒక‌టి అభిమానుల్లో ఉండేది. దీనికి స‌మాధానం వ‌చ్చేసిందిప్పుడు. ద‌స‌రా రోజు అంటే అక్టోబ‌ర్ 18న ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతుంది. న‌ర్త‌న‌శాల ఫేమ్ కాష్మీర్ ప‌ర్దేశీ ఇందులో హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. నిత్యామీన‌న్ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ విడుద‌ల‌కు జెర్సీని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో సినిమా చేయ‌నున్నాడు నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here