సంక్రాంతి పోరు.. ఆ ముగ్గురే క‌డ‌వ‌ర‌కు..!

సంక్రాంతి అంటేనే సినిమా పండ‌గ‌. అప్పుడు రావాల‌ని ఎప్ప‌ట్నుంచో మ‌న హీరోలంతా సిద్ధ‌మై ఉంటారు. 2019లోనూ ఇదే జ‌రుగుతుంది. అప్పుడు రావాల‌ని ఇప్ప‌టికే ముగ్గురు స్టార్ హీరోలు ఖ‌ర్చీఫ్ వేసి కూర్చున్నారు. అన్నీ భారీ సినిమాలే కావ‌డంతో 2017 ర‌చ్చ మ‌ళ్లీ రిపీట్ అవుతుందేమో అని భ‌య‌ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు.

ram cahran,f2,venkatesh,krish,ntr biopic

అప్పుడు పండ‌క్కి వ‌చ్చిన ఖైదీ నెం 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో పాటు శ‌త‌మానం భ‌వ‌తి కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి మూడు భారీ సినిమాలు రాబోతున్నాయి. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌స్తుంటే.. 11న రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా విడుద‌ల కానుంది. డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తో పాటు ప్ర‌శాంత్, స్నేహ న‌టిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్. డిసెంబ‌ర్ నాటికి టాకీ పూర్తి చేసి.. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీ కానున్నారు చిత్ర‌యూనిట్. సంక్రాంతికి సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే నాయ‌క్.. ఎవ‌డు లాంటి విజ‌యాలు సంక్రాంతికి అందుకున్నాడు రామ్ చ‌ర‌ణ్.

బాల‌య్య కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ తో సంక్రాంతికి వ‌స్తాన‌ని చెప్పాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న‌ట్లుగా జ‌రుగుతుంది. ఎక్క‌డా డిలే కాకుండా అనుకున్న టైమ్ కు షూట్ పూర్తి చేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న తొలిభాగం.. 24న రెండో భాగం విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే క్రిష్-బాల‌య్య కాంబినేష‌న్ శాత‌క‌ర్ణిని 2017 సంక్రాంతికి విడుద‌ల చేసి స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేయాల‌ని చూస్తున్నారు. ఇక చ‌ర‌ణ్, బాల‌య్య‌తో పాటు వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 కూడా ఇదే పండ‌క్కి రాబోతుంది. ఈ మేర‌కు దిల్ రాజు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. జ‌న‌వ‌రి 12న అనిల్ రావిపూడి ఎఫ్ 2 విడుద‌ల కానుంద‌ని చెప్పాడు రాజు. దానికి తోడు దిల్ రాజుకు సంక్రాంతి బాగా క‌లిసొచ్చింది. మ‌రి చూడాలిక‌.. ఈ ముగ్గురు కానీ పండ‌క్కి వ‌స్తే సంద‌డే సంద‌డి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here