ఆ బ‌యోపిక్ లో న‌టిస్తున్న ఝాన్వీక‌పూర్..

ఒక్క సినిమా అనుభ‌వంతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్వీక‌పూర్. అప్పుడే ఈ భామ బ‌యోపిక్ ల‌లో న‌టించే స్థాయికి ఎదిగింది. తల్లి శ్రీదేవి కోరికను తీర్చే పనిలో బిజీగా ఉంది కూతురు జాన్వికపూర్. త్వరత్వరగా స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది ఈ భామ‌. ఈ ఏడాది ధడక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వి.. వరస సినిమాలతో స‌త్తా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ భామ రెండు భారీ సినిమాల్లో నటిస్తుంది.

Janhvi Kapoor Look as IAF Officer Gunjan Saxena leaked

అందాల ఆరబోతతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న త‌ఖ్త్ సినిమాలో నటిస్తోంది జాన్వీ. ఈ చిత్రంలో జాన్వికపూర్ తో పాటు కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, అలియాభట్, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు. ఇంత భారీ సినిమాలో జాన్వికి అవకాశం రావడం గొప్ప విషయమే.
ఇక ఈ సినిమా సెట్స్ సై ఉండగానే మరో భారీ సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ భామ‌.

ఈసారి బ‌యోపిక్ కోసం సిద్ధం అవుతుంది. ప్రముఖ భార‌తీయ వైమానిక యోధురాలు గుంజ‌న్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కబోయే చిత్రంలో జాన్వి నటించబోతుంది. దీనికోసం వైమానిక రంగంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుంది ఈ భామ‌. ఈ చిత్రం త‌న‌కు నటిగా చాలా మంచి పేరు తీసుకువస్తుందని నమ్మకంతో ఉంది జాన్వికపూర్. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటిగా తనను తాను నిరూపించుకునే పనిలో బిజీగా ఉంది జూనియర్ శ్రీదేవి. మొత్తానికి ఈమె జోరు చూస్తుంటే తల్లి కోరికను త్వరలోనే నెరవేర్చేలా కనిపిస్తుంది. ఈ సమయంలో శ్రీదేవి లేదు కానీ ఒకవేళ ఉండుంటే మాత్రం కూతురు ఎదుగుదల చూసి గాలిలో తేలిపోయి ఉండేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *