బాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. ఇర్ఫాన్ ఖాన్ వ‌స్తున్నాడు.

అవును.. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. కొన్ని నెల‌లుగా ప్రాణాల‌తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడు వ‌చ్చేస్తున్నాడు. ఈయ‌న కేన్స‌ర్ తో పోరాడుతూ ఇంకా జ‌యించ‌లేదు కానీ దాదాపు విజ‌యానికి ద‌గ్గ‌ర్లో ఉన్నాడు. ఆ మ‌ధ్య ఈయ‌న ఫోటోలు చూసి ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు అని బాధ ప‌డుతున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఈయ‌న ఇండియా వ‌స్తున్నాడు.

irrfan khan

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కంటిముందు తిరిగిన వ్య‌క్తి.. సినిమాల్లో హాయిగా న‌టించిన వ్య‌క్తి ఇప్పుడు స‌డ‌న్ గా హాస్పిట‌ల్ బెడ్డు మీదున్నాడు. అస‌లు జీవితం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా ప‌రీక్షిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. 51 ఏళ్ల ఈ న‌టుడు అరుదైన క్యాన్స‌ర్ వ్యాధితో బాధ ప‌డుతున్నాడు. చివ‌రి స్టేజ్ వ‌ర‌కు కూడా బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. లండ‌న్ లోని ఓ హాస్పిట‌ల్ లో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నాడు.

ఇర్ఫాన్ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంద‌ని చెబుతున్నా.. ఆయ‌న ఫోటో చూస్తుంటే మాత్రం చాలా పీల‌గా మారిపోయి స‌న్న‌గా అయిపోయాడు. ఇది చూసిన త‌ర్వాత అభిమానుల్లో టెన్ష‌న్ పెరిగిపోతుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫోటోలో మ‌రీ బ‌క్క‌చిక్కిపోయి క‌నిపించాడు ఇర్ఫాన్. న‌వ్వుతూ క‌నిపిస్తున్నా ఆ న‌వ్వు వెన‌క బాధ కూడా క‌నిపిస్తుంది. ఈ ఫోటో చూసాకే ఫ్యాన్స్ క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న ఆరోగ్యం కాస్త కుదుట ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. దేవుడి ప్రార్థ‌న‌లో ఏమో కానీ ప్ర‌స్తుతానికి ఆయ‌న ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డాడు. ఆ మ‌ధ్య మ‌రో నెల రోజుల్లోనే ఇర్ఫాన్ జీవితం ముగుస్తుంద‌ని కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇది నిజం కాద‌ని.. ఇప్పుడు ఈయ‌న బాగానే ఉన్నాడ‌ని.. దివాళికి ఇండియాకు వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న వ‌చ్చిన త‌ర్వాత షూటింగ్స్ లో పాల్గొంటాడా లేదా అనేది మాత్రం అనుమాన‌మే. ఇంకొన్ని రోజుల త‌ర్వాత కానీ దీనిపై క్లారిటీ రాదు. మొత్తానికి ఏదేమైనా చాలా రోజుల త‌ర్వాత ఇర్ఫాన్ ఖాన్ ను చూడ‌బోతున్నాం అంటూ అత‌డి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *