2018 IMDB టాప్ 10 ఇండియ‌న్ సినిమాలివే.. ఉనికి చాటిన టాలీవుడ్..

తెలుగు సినిమాలు అంటే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బాగానే పేరు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి వ‌చ్చిన త‌ర్వాత మ‌న సినిమాల‌కు ఇప్పుడు అక్క‌డ కూడా మంచి గిరాకీ వ‌చ్చింది. ముఖ్యంగా మ‌న సినిమాల‌ను రీమేక్ చేయ‌డం కాదు.. డ‌బ్బింగ్ చేసుకుని కూడా క్యాష్ చేసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

IMDB-Top-10-Movies

ఇలాంటి టైమ్ లో ఏడాది చివ‌ర్లో ప్ర‌ఖ్యాత బాక్సాఫీస్ సంస్థ IMDB ప్ర‌క‌టించే ఇండియ‌న్ టాప్ 10 సినిమాల జాబితాలో మ‌న సినిమాలు కూడా స‌త్తా చూపించాయి. సౌత్ నుంచి నాలుగు సినిమాలు ఇందులో ఉండ‌టం విశేషం. ముఖ్యంగా మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు టాప్ 10లో చోటు ద‌క్కించుకున్నాయి. అవార్డుల ప‌రంగానే కాకుండా రికార్డుల్లోనూ ఈ రెండు సినిమాలు స‌త్తా చూపించాయి.

ఈ లిస్ట్ లో తొలి స్థానంలో ఆయుష్మాన్ ఖురానా అంధాధున్.. రెండో స్థానంలో విష్ణు విశాల్ రాత్సాస‌న్.. మూడోస్థానంలో విజ‌య్ సేతుప‌తి 96.. నాలుగ‌స్థానంలో మ‌హాన‌టి.. ఐదోస్థానంలో బాదాయ్ హో.. ఆరోస్థానంలో అక్ష‌య్ కుమార్ ప్యాడ్ మ్యాన్.. ఏడో స్థానంలో రంగ‌స్థ‌లం.. ఎనిమిదో స్థానంలో రాజ్ కుమార్ రావు స్త్రీ.. తొమ్మిదో స్థానంలో రాజీ.. ప‌దోస్థానంలో సంజ‌య్ ద‌త్ సంజూ సినిమాలు ఉన్నాయి. మొత్తానికి IMDB లిస్ట్ ఇప్పుడు ఇండియ‌న్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here