ఇదం జ‌గ‌త్ ట్రైల‌ర్.. సుమంత్ ఏదో చేసేలా ఉన్నాడు..

ఒక్క సినిమా చాలు.. మ‌రిచిపోయిన హీరోను మ‌ళ్లీ గుర్తు చేయ‌డానికి..! గ‌తేడాది సుమంత్ విష‌యంలో ఇదే జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ మ‌రిచిపోయిన సుమంత్ ను మ‌ళ్లీరావా మ‌ళ్లీ గుర్తు చేసింది. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించ‌లేదు కానీ సుమంత్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యం మాత్రం గుర్తు చేసింది. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు నానితో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మ‌ళ్లీ రావా ఇచ్చిన స్పూర్థితో ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు సుమంత్. ఈ మ‌ధ్యే సుబ్ర‌మ‌ణ్య‌పురం సినిమా కూడా చేసాడు. ఈ చిత్రం అంత‌గా ఆడ‌లేదు కానీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు సుమంత్. అదే ఇదం జ‌గ‌త్.

ఇందులో సుమంత్ కాస్త నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగానే ఉంది. జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న క‌థ ఇది. ముఖ్యంగా ఫోటో జ‌ర్న‌లిస్టుల క‌థ‌లా క‌నిపిస్తుంది. ప్ర‌తీ ఇష్యూ క్యాష్ చేసుకునే ఫోటో జ‌ర్న‌లిస్ట్ గా సుమంత్ న‌టిస్తున్నాడు.

కొత్త ద‌ర్శ‌కుడు అనిల్ శ్రీ‌కంఠం తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది. సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ విగ్నేష్ కార్తిక్ సినిమాస్ పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మ‌రి ఈ చిత్రంతో సుమంత్ మ‌ళ్లీ త‌న కెరీర్ ను గాడిన పెట్టుకుంటాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here