సూర్య ఇప్ప‌టికైనా మేలుకోవాలేమో.. లేదంటే..!

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ తో పాటు ఆయ‌న కూడా కోరుకుంటున్న‌ది ఇదే. ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు వ‌చ్చాయి ఈ హీరోకు. ఇప్పుడు ఈయ‌న ఏం చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నాడు. ఇమేజ్ ఉంది కానీ వాటికి త‌గ్గ విజ‌యాలే రావ‌డం లేదు. సింగం 2 త‌ర్వాత త‌ర్వాత సూర్య‌కు హిట్లు లేవు. వ‌చ్చిన ప్ర‌తీ సినిమా వ‌చ్చి వెళ్తుందే కానీ నిల‌బ‌డ‌టం లేదు.

surya

తెలుగులో ప‌ర్లేదేమో కానీ త‌మిళ‌నాట మాత్రం సూర్య సినిమాలు ఫ్లాపులు అయిపోయాయి. మొన్న విడుద‌లైన గ్యాంగ్ సైతం తెలుగులో ఓకే కానీ త‌మిళ్లో మాత్రం డిజాస్ట‌రే. ఈ చిత్రం తెలుగులో 8 కోట్లు వ‌సూలు చేసింది. సూర్య రేంజ్ ఇది కాదు.. ఐదేళ్ల కింద సింగం 2 తో అప్ప‌ట్లోనే 12 కోట్ల షేర్ వ‌సూలు చేసాడు సూర్య‌. అంటే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎంత మార్కెట్ ప‌డిపోయింది అనేది ఆయ‌నే చూసుకోవాలి ఒక్క‌సారి.

అప్పుడు 12 కోట్లు ఉన్న మార్కెట్ కాస్తా ఇప్పుడు 4 కోట్ల‌కు ప‌డిపోయింది. బ్ర‌ద‌ర్స్ సినిమానైతే అప్ప‌ట్లో బెల్లంకొండ ఏకంగా 14 కోట్ల‌కు కొన్నారు. కానీ గ్యాంగ్ సినిమాను కేవలం 4 కోట్ల‌కు కొన్నారు. అంటే 10 కోట్ల మార్కెట్ ప‌డిపోయింది. మ‌రి ఇప్పుడు అమ్మిన 4 కోట్లు వ‌చ్చాయ‌ని సంతోషించాలా.. లేదంటే ఉన్న మార్కెట్ ఇంత దారుణంగా ప‌డిపోయింద‌ని బాధ ప‌డాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నాడు సూర్య‌.

ఇప్పుడు సెల్వ రాఘ‌వ‌న్ ఎన్ జి కే సినిమాతో పాటు కేవీ ఆనంద్ సినిమాలో కూడా న‌టిస్తున్నాడు సూర్య‌. ఈ రెండు సినిమాలే త‌న కెరీర్ ను మార్చేస్తాయ‌ని.. క‌చ్చితంగా వీటితో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాన‌ని చెబుతున్నాడు సూర్య‌. ఎన్జికేలో సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత స్టార్ హీరోతో సెల్వ చేస్తోన్న సినిమా ఇది. ఇక కేవీ ఆనంద్ సినిమాపై కూడా న‌మ్మ‌కంగా ఉన్నాడు సూర్య‌. మ‌రి చూడాలిక‌.. ఈ రెండు సిన‌మాల‌తో సూర్య ఎలాంటి మాయ చేయ‌బోతున్నాడో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *