హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్

రొటీన్ సినిమా అయినా.. సూప‌ర్ హిట్ సినిమా అయినా పండ‌గ సీజ‌న్ లో వ‌చ్చిందంటే ఓపెనింగ్స్ కుమ్మేస్తుంది. ఇప్పుడు హ‌లోగురు ప్రేమ‌కోస‌మే విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. రామ్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రానికి యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. కొత్త‌ద‌నం లేదు అని తీర్మానించేసారు ప్రేక్ష‌కులు. కామెడీ కూడా ఊహించినంత లేక‌పోవ‌డం సినిమా లాంగ్ ర‌న్ ఎలా ఉంటుందో అనే కంగారు ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌నిపిస్తుంది.

Hello Guru Prema Kosame Collections

అయితే తొలిరోజు మాత్రం ఈ చిత్రానికి 4.25 కోట్ల షేర్ వ‌చ్చింది. దిల్ రాజు బ్రాండ్ ఇదివ‌ర‌క‌టి మాదిరి లేదు కాబ‌ట్టి మున‌ప‌టి వ‌సూళ్లు రావ‌డం లేదు. రామ్ కెరీర్ లో కూడా కూడా ఇది రెండో బెస్ట్ ఓపెనింగ్స్.ఉన్న‌ది ఒక‌టే జింద‌గీకి దీనికంటే మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. కానీ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే మాత్రం ఆ స్థాయి వ‌సూళ్లు తీసుకురాలేక‌పోయింది. దానికి టాక్ యావ‌రేజ్ గా రావ‌డం కావ‌చ్చు.. లేదంటే రామ్ ఇమేజ్ త‌గ్గుండొచ్చు. కార‌ణం ఏదైనా కూడా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే క‌లెక్ష‌న్స్ తొలిరోజు ప‌ర్లేద‌నే స్థాయిలో వ‌చ్చాయి. ఇదే జోరు కొన‌సాగుతుందా లేదా అనేది మాత్రం అనుమాన‌మే. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 25 కోట్లు రావాలి. ఇప్పుడు సిచ్చువేష‌న్ చూస్తుంటే అంతొస్తుందా అంటే స‌మాధానం శూన్య‌మే. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here