హ‌లో గురూ.. టార్గెట్ భారీగా ఉందిగా..!

రామ్ గ‌త సినిమా ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ్లాప్.. ఆ సినిమా బిజినెస్ 20 కోట్లు కూడా లేదు. పైగా సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా టార్గెట్ రీచ్ కాలేక చేతులెత్తేసింది. ఇప్పుడు మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు రామ్. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంటూ ఏడాది త‌ర్వాత మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు ఈ హీరో. ఈ సారి కూడా టార్గెట్ మ‌రింత భారీగా ఉంది. రెండు వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఈ చిత్రాన్ని 24 కోట్ల‌కు అమ్మేసాడు దిల్ రాజు.

Hello guru prema kosame

అది ఆయ‌న మార్క్ కావ‌చ్చు.. ఆయ‌న బ్యాన‌ర్ కు ఉన్న ఇమేజ్ కావ‌చ్చు.. కానీ ఈ ఏడాది శ్రీనివాస క‌ళ్యాణం, ల‌వ‌ర్ ల‌తో దెబ్బ‌తిన్నాడు రాజు. ఇప్పుడు ఈయ‌న కెరీర్ కు కూడా హ‌లో గురు కీల‌కంగా కానుంది. త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత న‌టించారు. ప్ర‌కాశ్ రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అక్టోబ‌ర్ 18న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది ఈ చిత్రం. 24 కోట్లు అంటే ఇప్పుడు రామ్ ఉన్న ప‌రిస్థితుల్లో కాస్త క‌ష్ట‌మే. కానీ అసాధ్యం మాత్రం కాదు. సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చిందంటే మాత్రం పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి వ‌చ్చినా వ‌చ్చేస్తాయి. అయితే పోటీగా పందెంకోడి 2 కూడా ఉంది. దాన్ని కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? 24 కోట్ల వైపు రామ్ అడుగులు ప‌డ‌తాయో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here