మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న హ‌రీష్ శంక‌ర్..

ఏడాదిగా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోతే ఎక్క‌డున్నాడో అనుకున్నారు కానీ ఏకంగా రెండు సినిమాల‌తో సీన్ లోకి వ‌స్తున్నాడ‌ని ఎవరూ ఊహించ‌లేదు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ ఇదే చేస్తున్నాడు. పాపం ఏ ముహూర్తంలో దాగుడుమూత‌లు అని టైటిల్ పెట్టుకున్నాడో కానీ అప్ప‌ట్నుంచీ హ‌రీష్ శంక‌ర్ కు ఇదే మిగిలింది. క‌థ‌.. ద‌ర్శ‌కుడు.. అంతా సిద్ధంగా ఉన్నా కూడా ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

HARISH SHANKAR, NANI ,VARUN TEJ, SAI DHARAM TEJ

నితిన్, శ‌ర్వానంద్ ల‌ను కాద‌ని.. ఇప్పుడు త‌న‌కు అచ్చొచ్చిన హీరో ల‌తోనే ఈ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. గ‌బ్బ‌ర్ సింగ్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్.. దువ్వాడ జ‌గ‌న్నాథమ్ తో మెగా హీరోల‌కు ఈయ‌న‌కు బాగానే సింక్ కుదిరింది.
ఇప్పుడు కూడా వీళ్ళ‌తోనే సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. క‌మ‌ర్షియల్ డైరెక్ట‌ర్ గా హ‌రీష్ శంక‌ర్ కు తిరుగులేదు. ఒక్క సినిమాతో ఇమేజ్ మార్చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. దాగుడుమూతలు సినిమా ఇప్ప‌టికే మొద‌ల‌వ్వాల్సి ఉన్నా ఇంకా కాలేదు. నితిన్, శ‌ర్వానంద్ ఇప్పుడు ఇత‌ర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు.

దాంతో ఇదే క‌థ‌ను సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ ల‌తో చేయ‌బోతున్నాడు హ‌రీష్. దీనిపై ఈ ద‌ర్శ‌కుడు కూడా ఇప్ప‌ట్లో ఏ ప్ర‌క‌ట‌న చేయ‌ట్లేదు. అంతేకాదు.. హీరోలే కాదు నిర్మాత‌ కూడా మారిపోయిన‌ట్లే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ముందు దిల్ రాజు నిర్మిస్తాన‌ని చెప్పినా.. ఇప్పుడు 14 రీల్స్ ద‌గ్గ‌రికి వెళ్లింద‌ని తెలుస్తుంది. ఇక దాంతోపాటు నానితోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు హ‌రీష్. అయితే అన్నీ ప్లాన్ చేస్తున్నాడు కానీ ఎప్పుడు ఏదీ ప‌ట్టాలెక్క‌డం మాత్రం ఖాయంగా చెప్ప‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here