వ‌రుణ్ తేజ్ సినిమా కూడా పోయిందా హ‌రీష్ శంక‌రా..?

ఒక్క‌టి రెండు మూడు అంటూ నెల‌లు గడిచిపోతున్నాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త సినిమా మాత్రం మొద‌లు పెట్ట‌లేక‌పోతున్నాడు హ‌రీష్ శంక‌ర్. వ‌రుణ్ తేజ్ తో జిగ‌ర్తాండ రీమేక్ చేస్తున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చినా కూడా అది కూడా ఇప్పుడు ఆగిపోయింద‌ని తెలుస్తుంది.

Harish Shankar Upcoming Movie Gossips

ఏం త‌ప్పు చేసాడో తెలియ‌దు కానీ ఏడాదిన్న‌ర‌గా శిక్ష మాత్రం అనుభ‌విస్తూనే ఉన్నాడు హ‌రీష్ శంక‌ర్. ఈయ‌న కంటే దారుణ‌మైన ఫ్లాపులు ఇచ్చిన ద‌ర్శ‌కులు కూడా సినిమాలు చేస్తున్నారు కానీ ఈయ‌న మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈయ‌న్ని చూస్తుంటే పాపం అనిపించ‌క మాన‌దు. డిజే లాంటి 70 కోట్ల సినిమా ఇచ్చి కూడా ఖాళీగా ఉన్నాడు. దాగుడుమూత‌లు అనుకున్నా కూడా సెట్ కాలేదు.

మ‌ధ్య‌లో 96 రీమేక్ అనుకున్నా కూడా కుద‌ర్లేదు. ఆ త‌ర్వాత జిగ‌ర్తాండ కూడా ప్లాన్ చేసాడు. అది కూడా ఇప్పుడు ప‌ట్టాలెక్క‌డం లేదు. ఆ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చి రీమేక్ చేయ‌డానికి చూస్తున్నాడు హ‌రీష్. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ అనుక‌న్నారు కానీ ఇప్పుడు ఈయ‌న ఇటు వైపు కూడా చూడ‌టం లేదు. బ‌న్నీ బ్ర‌ద‌ర్ బాబీ నిర్మాత‌గా కిర‌ణ్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేయ‌డానికి వ‌రుణ్ తేజ్ సైన్ చేసాడు. దాంతో ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ మ‌ళ్లీ ఖాళీ అయ్యాడు. అందుకే ఇప్పుడు ఈయ‌న నెక్ట్స్ ఏంటి అనేది గండికోట ర‌హ‌స్యంలా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here