హ్యాపీ బ‌ర్త్ డే టూ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్..

ర‌జినీకాంత్.. ఆ పేరులోనే ఏదో మ‌త్తు ఉంది.. ఏదో మాయ ఉంది.. మిగిలిన హీరోల‌కు లేనిది.. ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన ఏదో ఇంద్ర‌జాలం ఉంది. అస‌లు ఆయ‌న చూస్తుంటే అలా మైమ‌రిచిపోతుంటారు అభిమానులు. పెద్ద అంద‌గాడా అంటే కాదు.. పోనీ డాన్సులు కుమ్మేస్తాడా అంటే లేదు.. న‌ట‌న క‌మ‌ల్ హాస‌న్ మాదిరి అద్భుతంగా ఉంటుందా అంటే అదీ కాదు.. కానీ ర‌జినీకాంత్ అంటే పిచ్చి.. వెర్రి.. ఏదో తెలియ‌ని చొక్కాలు చించేసుకునే అభిమానం.

Happy Birth Day Thalaivar

ఎందుకంటే స‌మాధానం శూన్యం. కొంద‌ర్ని దేవుడు అలా పుట్టిస్తాడంతే. అలాంటి కేట‌గిరీలోకే ర‌జినీకాంత్ కూడా వ‌స్తాడు. ఆయ‌న చూస్తుంటే.. న‌డుస్తుంటే.. సిగ‌రెట్ కాలుస్తుంటే.. న‌వ్వుతుంటే ఏం చేసినా కూడా స్టైల్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. అస‌లు ఆయ‌న కోస‌మే ఆ స్టైల్ అనే ప‌దం పుట్టిందేమో అనిపిస్తుంది.43 ఏళ్లుగా ఇండియ‌న్ సినిమాను ఏలుతున్న సూప‌ర్ స్టార్.. ఇప్పుడు 2.0తో 500 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసాడు. 2018, డిసెంబ‌ర్ 12 నాటికి 68 ఏళ్లు పూర్తి చేసుకుని.. 69వ ఏట అడుగు పెడుతున్నాడు ర‌జినీకాంత్. అయినా కూడా ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న పేట్ట సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

1975 లో బాల‌చంద‌ర్ అపూర్వ రాగంగ‌ల్ సినిమాలో విల‌న్ గా తొలిసారి సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు ర‌జినీకాంత్. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో విల‌న్ గానే న‌టించాడు. అయితే 80ల్లోకి వ‌చ్చేస‌రికి హీరో అయ్యాడు ర‌జినీ. బిల్లా సినిమాతో ఈయ‌న కెరీర్ మారిపోయింది. ఆ సినిమా అత‌డిలోని మాస్ హీరోను బ‌య‌టికి తీసుకొచ్చింది. అప్ప‌టికే త‌మిళ ఇండ‌స్ట్రీని ఏలుతున్న‌క‌మ‌ల్ హాస‌న్, ఎంజిఆర్, శివాజీ గ‌ణేష‌న్ లాంటి స్టార్ హీరోల‌ను త‌ట్టుకుని స్టార్ అయ్యాడు ర‌జినీకాంత్.
90వ ద‌శ‌కంలో సూప‌ర్ స్టార్ కు స్వ‌ర్ణ‌యుగమే న‌డిచింది. మాప్పిళ్లై.. బాషా.. ముత్తు.. ప‌డ‌య‌ప్పా.. లాంటి ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క సినిమాలతో ఇండియ‌న్ రికార్డుల‌ను సైతం కుదిపేసాడు ర‌జినీకాంత్. మిలీనియం మొద‌ట్లో కాస్త త‌డ‌బ‌డినా 2005లో చంద్ర‌ముఖితో రీ ఎంట్రీ ఇచ్చి స‌త్తా చూపించారు.

ఆ త‌ర్వాత శివాజీ.. రోబో లాంటి సినిమాలతో ఆల్ టైమ్ రికార్డులు తిరగ‌రాసాడు. ఇక క‌బాలి లాంటి యావ‌రేజ్ సినిమాతో కూడా సెన్సేష‌న‌ల్ రికార్డులు సృష్టించాడు ర‌జినీ. ఆ మ‌ధ్య కాలా, లింగా లాంటి ఫ్లాపులు వ‌చ్చినా కూడా ఇప్పుడు 2.0తో ప‌ర్లేద‌నిపిస్తున్నాడు. త్వ‌ర‌లోనే పేట్ట అంటూ రానున్నాడు. ఇలా వ‌య‌సు 70కి చేరువ‌వుతున్నా కూడా ఇప్ప‌టికీ దూకుడు చూపిస్తూనే ఉన్నాడు సూప‌ర్ స్టార్. త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి కూడా వెళ్ళ‌నున్నాడు ఈయ‌న‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *