జిఎస్టీ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు త‌గ్గాయి.. పండ‌గ చేస్కోండి..

ఒక్క సినిమాకు వెళ్దాం అండీ అంటూ ఇంట్లో పెళ్లాం గోల పెడుతున్నా కూడా థియేటర్లు.. అక్క‌డి టికెట్ రేట్లు అంటే భ‌య‌ప‌డి ఇంటి ప‌ట్టునే ఉండే మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికీ వాళ్ళు నెల‌కు ఒక్క సినిమా చూసినా కూడా అద్భుత‌మే. ఎందుకంటే అక్క‌డ టికెట్ రేట్లు కూడా అలాగే ఉన్నాయి.

Govt Cuts GST rate on Movie Tickets

జిఎస్టీ పుణ్య‌మా అని 80 రూపాయ‌లు ఉన్న బాల్క‌నీ టికెట్ కాస్తా 118 రూ.కు వెళ్లిపోయింది. దాంతో ఒక్కో టికెట్ పై ప‌న్ను భారం సామాన్యుడి న‌డ్డిపై ప‌డింది. అయితే ఇప్పుడు గుడ్డిలో మెల్ల అన్న‌ట్లు కాస్తైనా క‌నిక‌రించారు. డిసెంబ‌ర్ 1 నుంచి 100 కంటే త‌క్కువ రేట్ ఉన్న టికెట్ పై 12 శాతం ప‌న్ను ఉంటుంది.. ఇదివ‌ర‌కు అది 18 శాతం ఉండేది. ఇక 100 పైన రేట్ ఉంటే.. 18 శాతం ప‌న్ను ఉంది. ఇదివ‌ర‌కు అది 28 శాతం ఉండేది.

దాంతో ఇప్పుడు కాస్తైనా రేట్లు త‌గ్గాయి. మ‌రీ ఎక్కువ కాక‌పోయినా క‌నీసం టికెట్ పై ప‌ది రూపాయ‌లైనా త‌గ్గుతుంది క‌దా అని సంతోషిస్తున్నాడు సామాన్యుడు. ఈ మాత్రం భార‌మైనా త‌గ్గించారు చాలు మ‌హాప్ర‌భో అంటూ మోదిని మోస్తున్నారు సినిమా నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు. మొత్తానికి కేంద్రం తీసుకున్న జిఎస్టీ నిర్ణ‌యంతో ఇప్పుడు సినిమా అభిమానుల‌కు మాత్రం కాస్త ఊర‌ట ల‌భించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here