గోపీచంద్ కొత్త సినిమా షురూ.. ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా..?

రెండు మూడేళ్ల గోపీచంద్ కు ఉన్న ఇమేజ్ వేరు.. ఆయ‌న మార్కెట్ వేరు. గోపీ సినిమా వ‌స్తుందంటే మినిమ‌మ్ గ్యారెంటీ ఉండేది. 10 నుంచి 15 కోట్ల మ‌ద్య‌లో త‌న బిజినెస్ చేసుకుని వెళ్లిపోయేవాడు. న‌మ్మిన బ‌య్య‌ర్ల‌ను కూడా ముంచేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు ప‌రిస్థితి. ఈయ‌న ప‌రిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. సినిమాలు బాగున్నా కూడా క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు ఇప్పుడు. పంతం సినిమా చూసిన త‌ర్వాత అంద‌రికీ అనిపించింది ఇదే. 25వ సినిమా క‌దా అందుకే కాస్త శ్ర‌ద్ధ పెట్టి మ‌రీ సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ చేసాడు ఈ హీరో.

Gopi chand next movie with tamil director

కొత్త ద‌ర్శ‌కుడే అయినా కూడా చ‌క్ర‌వ‌ర్తి దీన్ని బాగానే హ్యాండిల్ చేసాడు. అయితే క‌థ మ‌రీ రొటీన్ కావ‌డ‌మే ఇక్క‌డ అస‌లు చిక్కుల్ని తీసుకొచ్చింది. గోపీచంద్ త‌న పాత్ర వ‌ర‌కు చంపేసాడు.. ఈ పాత్ర కోస‌మే పుట్టాడా అనేంత‌గా ఇందులో ఒదిగిపోయాడు. కానీ క‌థ స‌హ‌క‌రించ‌క‌పోతే పాపం ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు..?

పంతం ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు గోపీచంద్ కు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. ఇన్ని రోజుల క‌న్ఫ్యూజ‌న్ త‌ర్వాత ఇప్పుడే ఓ క్లారిటీ వ‌చ్చింది ఈ హీరోకు. త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జనవరి 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

మే 2019లో సినిమా విడుదల కానుంది. స్పై థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెట్రి ఫ‌ల‌నిస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో క‌చ్చితంగా మ‌ళ్లీ త‌న ల‌క్ మారుతుంద‌ని న‌మ్ముతున్నాడు గోపీచంద్. ఈ సినిమా త‌ర్వాత శ్రీ‌వాస్ సినిమా కూడా ఉండ‌బోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *