గూఢ‌చారిలో లోపం ఏంటి..?

గూఢ‌చారిలో ఏం లోపం ఉంది..? ఈ సినిమా కూడా హిట్ అయింది క‌దా.. క‌లెక్ష‌న్లు కూడా కుమ్మేసాడు ఇంకేం కావాలి అనుకుంటున్నారా..? అవును.. స్టార్ ఇమేజ్ లేకుండా.. భారీ క్యాస్టింగ్ లేకుండా క‌థ‌తో హిట్ కొట్టాడు అడ‌విశేష్.

ఈయ‌న న‌టించిన గూఢ‌చారి 10 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. గూఢ‌చారి 116 అంటూ ర‌చ్చ చేసాడు ఈ కుర్ర హీరో. క్ష‌ణం త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మ‌రో సినిమాతో వ‌చ్చాడు అడ‌విశేష్. ఇన్నాళ్లూ ఈయ‌న సినిమా వ‌స్తుందంటే త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం కాదు.. అస‌లు అంచ‌నా వేయ‌డ‌మే త‌క్కువ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. క్ష‌ణంతోనే మ‌నోడు ఇండ‌స్ట్రీకి హింట్ ఇచ్చాడు. త‌ను ఒక‌డిని ఉన్నాన‌ని. అప్పుడు కూడా ఈ హీరో గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఇప్పుడు మ‌రోసారి గూఢ‌చారి అంటూ వ‌చ్చి ర‌చ్చ చేసాడు శేష్. స్క్రీన్ ప్లే ప్ల‌స్ అదిరిపోయే రైటింగ్ తో అడ‌విశేష్ మాయ చేసాడు. త‌న‌లో న‌టుడితో పాటు ఇంకా చాలా కోణాలున్నాయ‌ని మ‌ళ్లీ నిరూపించుకున్నాడు. జేమ్స్ బాండ్ సినిమాల త‌ర‌హా ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించినా.. మ‌న‌కు న‌చ్చేట్లుగానే క‌థ రాసుకున్నాడు అడ‌విశేష్. ఇక అభిషేక్ పిక్చ‌ర్స్ ఇచ్చిన 4 కోట్ల‌తోనే ఇంత క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వ‌డం అద్భుత‌మే.

అంతా బాగానే జ‌రిగింది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను ఎవ‌రూ సొంతం చేసుకోక‌పోవ‌డం మాత్రం ఆశ్చ‌ర్యంగా ఉంది. హిట్టైన సినిమాల‌ను ఇట్టే ప‌ట్టుకుపోయే మ‌న చానెల్స్ ఎందుకో కానీ గూఢ‌చారి వైపు చూడ‌టం లేదు. మ‌రి దీనిలోపం ద‌ర్శ‌క నిర్మాత‌ల ద‌గ్గ‌ర ఉందా.. లేదంటే ఛానెల్ యాజ‌మాన్యాల ద‌గ్గ‌రుందో అర్థం కావ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here