గోవిందం ఇంక నువ్వు త‌గ్గ‌వా..?

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు నిర్మాత‌లు గీత‌గోవిందం సినిమాను ఇదే అడుగుతున్నారు. ఎందుకంటే ఈ వారం త‌మ సినిమాలు కూడా విడుద‌ల కావాలి క‌దా.. క‌నీసం విడుద‌లైతే ప్రేక్ష‌కులు చూడాలి క‌దా..! ఇప్పుడు ఈ స్థాయిలో గీత‌గోవిందం ర‌చ్చ చేస్తుంటే ఎలా త‌మ సినిమాలు విడుద‌ల చేయాల‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు నిర్మాత‌లు.

ఈ వారం నాలుగు సినిమాలు వ‌స్తున్నాయి. ఆది నీవెవ‌రోతో పాటు ర‌ష్మి అంత‌కుమించి.. నారా రోహిత్ ఆట‌గాళ్ళు.. ప్ర‌భుదేవా ల‌క్ష్మి ఈ వార‌మే విడుద‌ల కానున్నాయి. అయితే ఇవి వ‌చ్చినా కూడా ఇప్పుడు గీత‌గోవిందం ధాటికి త‌ట్టుకుంటాయి అనే న‌మ్మ‌కం అయితే ఎవ‌రిలోనూ క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆరు రోజుల్లో 35 కోట్ల షేర్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించిన గీత‌గోవిందం.. ఏడో రోజు కూడా అదే దూకుడు కొన‌సాగించింది.

GEETHA GOVINDAM

పైగా బ‌క్రీద్ హాలీడే కావ‌డంతో క‌లెక్ష‌న్లు దున్నేయ‌డం ఖాయం. ఈ సినిమా దూకుడు చూస్తుంటే అస‌లు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుంద‌నేది కూడా అర్థం కావ‌డం లేదు. విజ‌య్ స‌త్తా ఈ రేంజ్ లో ఉందా అని అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు విజ‌య్ త‌న సినిమా స‌క్సెస్ రేంజ్ చూసి ఇంకేం ఇంకేం కావాలే.. చాలే ఇది చాల్లే అంటూ త‌న సినిమా పాటే తానే పాడుకుంటున్నాడు. అంత‌గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

ఓవ‌ర్సీస్ లో కూడా ఈ సినిమా ర‌చ్చ మామూలుగా లేదు. అక్క‌డ 1.7 మిలియ‌న్ దాటేసి 2 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తుంది గీత‌గోవిందం. అంతా చేస్తే ఈ సినిమాను అమ్మింది 15 కోట్ల‌కే. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి.. ఐదు రోజుల్లో డ‌బుల్ లాభాలు తెచ్చింది ఈ చిత్రం. ముందు 50 కోట్ల క్లబ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా 60 కోట్ల వైపు వెళ్లేలా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here