గీత‌గోవిందం.. ఫ‌స్ట్ మండే సూప‌ర్ హిట్..!

ఈ రోజుల్లో ఏ సినిమా విడుద‌లై హిట్టైనా కూడా వీకెండ్ కాదు చూస్తున్న‌ది.. తొలి సోమ‌వారం ఎలా ఉంద‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తిగా చూస్తారు. ఆ రోజు కానీ వ‌సూళ్లు బాగా వ‌చ్చాయంటే సినిమా నిల‌బ‌డిపోయిన‌ట్లే. ఈ విష‌యంలో గీత‌గోవిందం సూప‌ర్ హిట్ కాదు.. బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు.. వీకెండ్ త‌ర్వాత వ‌చ్చే సోమ‌వారం రోజు కూడా అరాచ‌కాలు చేసింది ఈ చిత్రం.

GEETHA GOVINDAM

ఇప్ప‌టికే ఐదు రోజుల్లో 32 కోట్ల షేర్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించిన గీత‌గోవిందం.. ఆరోరోజు కూడా అదే దూకుడు కొన‌సాగించింది. తొలిరోజే 10 కోట్ల షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత రోజుల్లోనూ దుమ్ము దులిపేసింది.
ఇప్పుడు ఈ సినిమా దూకుడు చూస్తుంటే అస‌లు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుంద‌నేది కూడా అర్థం కావ‌డం లేదు. విజ‌య్ స‌త్తా ఈ రేంజ్ లో ఉందా అని అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు.

మ‌రోవైపు విజ‌య్ త‌న సినిమా స‌క్సెస్ రేంజ్ చూసి ఇంకేం ఇంకేం కావాలే.. చాలే ఇది చాల్లే అంటూ త‌న సినిమా పాటే తానే పాడుకుంటున్నాడు. అంత‌గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఓవ‌ర్సీస్ లో కూడా ఈ సినిమా ర‌చ్చ మామూలుగా లేదు. అక్క‌డ 1.5 మిలియ‌న్ దాటేసి 2 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తుంది గీత‌గోవిందం. అంతా చేస్తే ఈ సినిమాను అమ్మింది 15 కోట్ల‌కే. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి.. ఐదు రోజుల్లో డ‌బుల్ లాభాలు తెచ్చింది ఈ చిత్రం. మొత్తానికి 50 కోట్ల షేర్ సాధించి ఏదో చ‌రిత్ర సృష్టించేలా క‌నిపిస్తుంది గీత‌గోవిందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here