బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ తో మంచు విష్ణు..

ఎవ‌రా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు పరుశురామ్. ఈయ‌న‌తోనే ఇప్పుడు విష్ణు త‌ర్వాతి సినిమా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. దీనికోసం కొన్ని రోజులుగా విష్ణు కూడా మ‌రే సినిమా సైన్ చేయ‌కుండా వేచి చూస్తున్నాడు.

Vishnu Manchu
ప్ర‌స్తుతం విష్ణు న‌టిస్తున్న ఓట‌ర్ షూటింగ్ పూర్తైంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌ను కార్తిక్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప‌రుశురామ్ తోనే సినిమా ఉండ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాతే మంచు విష్ణుతో ఓ సినిమా చేయాల్సి ఉంది ప‌రుశురామ్.

శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ‌లో మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా చేయాల్సి ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడ‌నే ప్ర‌చారం కూడా ఇండ‌స్ట్రీలో ఉంది. అయితే అప్ప‌టికే గీతాఆర్ట్స్ లో మ‌రో సినిమాకు క‌మిటవ్వ‌డం.. విజ‌య్ దేర‌వ‌కొండ హీరోగా ఎంపిక‌వ్వ‌డంతో ఆ సినిమా పూర్తి చేసుకున్న త‌ర్వాత ఇక్క‌డి సినిమా చేస్తాన‌ని మాటిచ్చిన‌ట్లు తెలుస్తుంది.

ఇప్పుడు గీత‌గోవిందం విడుద‌లైంది. సినిమా ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అయిపోయింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా వ‌స్తున్నాయి. విజ‌య్ ఈ సినిమాతో స్టార్ అయిపోయాడు. ఇక ప‌రుశురామ్ రేంజ్ కూడా మారిపోయింది. దాంతో ఇప్పుడు మంచు విష్ణుతో సినిమా ఉంటుందా లేదా అనే ఆస‌క్తి మొద‌లైంది. అయితే క‌చ్చితంగా విష్ణుతో సినిమా చేస్తాన‌ని చెప్ప‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ఆస‌క్తి మొద‌లైంది. అస‌లే ఈ మ‌ధ్య కాస్త విజ‌యాల వేట‌లో వెన‌క ఉన్నాడు విష్ణు. ఇలాంటి టైమ్ లో రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న ప‌రుశురామ్ తో సినిమా గానీ చేస్తే ఈయ‌న కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here