బాపురే.. రెండో రోజుకే బ్రేక్ ఈవెన్..

15 కోట్ల‌కు ఓ సినిమాను అమ్మితే.. రెండు రోజుల్లోనే ఆ వ‌సూళ్లు తీసుకొస్తే ఇక ఆ సినిమా రేంజ్ ఏమ‌నాలి..? ఇప్పుడు గీత‌గోవిందం జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లు చిన్న సినిమాగా మొద‌లైన ఇది ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. ఒక్క‌టి రెండు కాదు.. రెండు రోజుల్లోనే దాదాపు 15 కోట్ల వ‌ర‌కు షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం.

GEETHA GOVINDAM COLLECTIONS

తొలిరోజే 10 కోట్ల షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం.. రెండోరోజు కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇంకా మాట్లాడితే పెరిగింది ఈ సినిమా ర‌చ్చ. ఇప్పుడు ఈ సినిమా దూకుడు చూస్తుంటే అస‌లు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుంద‌నేది కూడా అర్థం కావ‌డం లేదు. విజ‌య్ స‌త్తా ఈ రేంజ్ లో ఉందా అని అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు.

మ‌రోవైపు విజ‌య్ మాత్రం త‌న సినిమా స‌క్సెస్ రేంజ్ చూసి ఇంకేం ఇంకేం కావాలే.. చాలే ఇది చాల్లే అంటూ త‌న సినిమా పాటే తానే పాడుకుంటున్నాడు. అంత‌గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఒక‌టి రెండు కాదు.. వీకెండ్ ముగిసేస‌రికి ఈజీగా ఈ చిత్రం 25 కోట్ల‌కు పైగానే షేర్ తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఇదే కానీ జ‌రిగితే ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్స్ లిస్ట్ లో గీత‌గోవిందం కూడా ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. అంతా చేస్తే ఈ సినిమాను అమ్మింది 15 కోట్ల‌కే. రెండు రోజుల్లోనే ఈ మొత్తం వ‌చ్చి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోయి.. మూడో రోజు నుంచే లాభాలు తీసుకురావ‌డం మొద‌లుపెట్టింది ఈ చిత్రం. మ‌రి దీని ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డ ఆగుతుందో చూడాలిక‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *