గీత‌గోవిందం ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చేసాయి..

గీత‌గోవిందం.. ఈ ఏడాది కాదు.. 80 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ సినిమా ముందు చాలా సినిమాలు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాయి కానీ ఇది మాత్రం 50 రోజుల పాటు ఆడుతూనే ఉంది. ఇప్పుడు గీత‌గోవిందం ఫుల్ ర‌న్ క‌లెక్ష‌న్స్ లెక్క‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. అవి చూసిన త‌ర్వాత అబ్బో అద్బుతం అనుకోకుండా ఉండ‌లేరు. ఎందుకంటే విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ఇది చూపించింది కాబ‌ట్టి. 68 కోట్ల ద‌గ్గ‌ర గీత‌గోవిందం ఫైన‌ల్ ర‌న్ ముగిసింది.

ప‌రుశురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌లైంది. అప్ప‌ట్నుంచి నాలుగు వారాల పాటు ఆడింది. చాలా సినిమాలు వ‌చ్చినా కూడా వాటిని త‌ట్టుకుని మ‌రి ఈ చిత్రం నిల‌బ‌డింది. ఇక ఇప్పుడు ఫైన‌ల్ ర‌న్ లో కూడా స‌త్తా చూపించింది గీత‌గోవిందం. నైజాంలో 20 కోట్లు.. ఓవ‌ర్సీస్ లో 12 కోట్లు.. క‌ర్ణాట‌క‌లో 8 కోట్లు.. త‌మిళ‌నాట 6 కోట్లు.. ఇలా చాలాచోట్ల రికార్డులు తిర‌గ‌రాసాడు విజ‌య్. ప‌రుశురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం విజ‌య్ ఇమేజ్ ను మూడింత‌లు పెంచేసింది. మ‌రి చూడాలి.. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలా వాడుకోబోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here