గ‌ణేష్.. నూత‌న్ ఔట్.. నెక్ట్స్ శ్యామ‌ల‌..? 

వారం వారం ఆసక్తి పెంచేస్తుంది బిగ్ బాస్. ఈ వారం అయితే మరింత ఆసక్తిగా వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇన్ని వారాలు ఆదివారం వస్తే ఎవరు బయటికి వెళ్లిపోతారా అని ఆస‌క్తిగా చూస్తున్నారు. షో రేటింగ్ పెంచ‌డానికి తమ చేతిలో ఉన్న అన్ని అస్త్రాలను వాడేస్తున్నారు. ఇక ఈ వారం కూడా ఇదే జ‌రిగింది.

ఒకేసారి ఇద్ద‌రు కంటెస్టెంట్ల‌ను బ‌య‌టికి పంపించేసారు నిర్వాహ‌కులు. అది కూడా కామ‌న‌ర్స్ ఇద్ద‌ర్నీ కామ‌న్ గా టార్గెట్ చేసారు. గ‌ణేష్ తో పాటు నూత‌న్ నాయుడు కూడా ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు. దాంతో ఇక‌పై షో పూర్తిగా సెలెబ్రెటీస్ సొంతం అన్న‌మాట‌. ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్లంతా సెలెబ్రెటీసే.

Ganesh nutan out of biggboss
Ganesh nutan out of biggboss

ఇప్ప‌ట్నుంచి నామినేష‌న్స్ తో పాటు ఎలిమినేష‌న్స్ కూడా షాక్ ఇస్తూనే ఉంటాయ‌ని నాని కూడా చెప్ప‌డంతో ఎప్పుడు ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తార‌నేది అర్థం కావ‌డం లేదు. ముఖ్యంగా కౌశ‌ల్ ఆర్మీ అనేది బ‌య‌ట బాగా వినిపిస్తున్న మాట‌. దీని తోక క‌త్తిరించ‌డానికి కౌశ‌ల్ ను కూడా బ‌య‌టికి పంపించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

ఇప్పుడు ఇంట్లో వాళ్ల ప‌రిస్థితులు చూస్తుంటే వ‌చ్చేవారం క‌చ్చితంగా శ్యామ‌ల‌.. దీప్తి న‌ల్ల‌మొత్తుల్లో ఎవ‌రో ఒక‌రు బ‌య‌టికి వ‌చ్చేలా క‌నిపిస్తున్నారు. షో ఇప్ప‌టికే మూడు నెల‌లు కావొస్తుండ‌టంతో షో నిర్వాహ‌కులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ముందుకెళ్తున్నారు. మ‌రో నాలుగు వారాలు మాత్ర‌మే గేమ్ ఉండ‌బోతుంది. దాంతో ర‌చ్చ మ‌రో స్థాయికి వెళ్లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here