నిహారికను సూర్యాకాంతం కాపాడుతుందా..?

ఒకమనసు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది నిహారిక. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కచ్చితంగా ఆ అంచనాలు అనేవి భారీగానే ఉంటాయి. అది నిహారికకు కూడా తెలియంది కాదు. అవి అందుకోవడంలో తొలి సినిమాతో దారుణంగా ఫ్లాప్ అయింది ఈ భామ.

First look of Niharika From Suryakantham

ఫ్లాప్ తో పాటు పేరు ఖరాబ్ చేస్తుందంటూ విమర్శలు కూడా రావడంతో బాగా గ్యాప్ తీసుకుని రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ హ్యాపీవెడ్డింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగా డాటర్. అయితే ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయింది. దాంతో మెగా డాట‌ర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నిహారిక రెండు సినిమాల‌తో బిజీగా ఉంది కానీ అవి ఎంత‌వ‌ర‌కు హిట్ అవుతాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

సీనియర్ హీరోయిన్ శ్రీయ‌తో క‌లిసి ఇందులో న‌టిస్తుంది నిహారిక‌. ఈ చిత్రానికి చాలా కాలం కిందే కొబ్బ‌రి కాయ్ కొట్టారు. సుజన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఇప్ప‌టికే సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయి లాక్ అయిపోయింది. ఇక ఇప్పుడు సూర్యాకాంతం అనే మ‌రో సినిమాతో వ‌స్తుంది నిహారిక‌.

డిసెంబ‌ర్ 18న ఈమె పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు. వ‌రుణ్ తేజ్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌ణీత్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. రాహుల్ విజ‌య్ హీరో. మొత్తానికి చూడాలిక‌.. ఈ సూర్యాకాంతం అయినా నిహారిక కోరుకున్న విజ‌యం తీసుకొస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here