తెలంగాణ ఎన్నిక‌ల్లో సినీ గ్లామ‌ర్ అడ్ర‌స్ గ‌ల్లంతు

శివాజీ సినిమాలో డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌లు అయిన త‌ర్వాత కేసీఆర్ కూడా ఇదే అంటున్నాడేమో మ‌రి..? అదేంటో అర్థం అయిపోయింది క‌దా మ‌ళ్లీ చెప్ప‌డం ఎందుకు.. అయినా ఓ సారి గుర్తు చేసుకుందాం.. నాన్నా పందులే గుంపుగా వ‌స్తాయి.. సింహం సింగిల్ గా వ‌స్తుంది. ఇక్క‌డ వాళ్ల‌ను పందులు అన‌డం లేదు కానీ కేసీఆర్ మాత్రం సింహంలా ఒక్క‌డే పోరాడాడు.

Film stars fail in telangana election

ఈ బ‌క్క కేసీఆర్ ను ఓడించ‌డానికి ఇంత‌మంది రావాల్నా వాయ్ అంటూ త‌న ప్ర‌సంగాల్లో చ‌మ‌క్కులు పూయించాడు కేసీఆర్. పైగా వాటినే త‌న ఆయుధంగా కూడా మార్చుకున్నాడు. ఇక్క‌డ ఒక్క‌డే.. మ‌న నేల కోసం అంత‌మంది జ‌ట్టు క‌ట్టి కుట్ర‌లు చేస్తున్నారు. మ‌నం స‌క్క‌గుండాలే లేక‌పోతే అంతే సంగ‌తులు అంటూ ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న రేపాడు కేసీఆర్. ఈయ‌న మాట‌ల ముందు ఎంత‌మంది స్టార్ కంపైన‌ర్లు వ‌చ్చినా.. సినిమా వాళ్లు వ‌చ్చి ప్ర‌చారం చేసినా కూడా ప్ర‌జ‌ల మైండ్ సెట్ మాత్రం మార్చ‌లేక‌పోయారు.

సినిమా వాళ్లు ప్ర‌చారానికి వ‌స్తే ఎలా ఉన్నారో చూసిపోదాం అని వ‌చ్చేవాళ్లే ఎక్కువ‌గా ఉంటారు కానీ ఓట్లేసే వాళ్లు మాత్రం కాదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. టిడిపి కోసం ఎమ్మెల్యే బాల‌య్య గొంతు చించుకుని మ‌రీ అరిస్తే కూడా పెద్ద‌గా ఓట్లు రాలేదు. పైగా ఆయ‌న ప్ర‌చారం చేసిన కూక‌ట్ ప‌ల్లితో పాటు హైద‌రాబాద్ లోనే మ‌రో రెండు మూడు నియోజ‌క వర్గాల్లో కూడా ఓడిపోయింది ఈ పార్టీ. ఇక బండ్ల గ‌ణేష్ అయితే సూప‌ర్ క‌మెడియ‌న్ ఈ ఎన్నిక‌ల్లో. కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని అది రాక‌పోతే త‌న గొంతు కోసుకుంటా అంటూ శ‌ప‌థాలు కూడా చేసాడు.

కానీ ఇప్పుడు టిఆర్ఎస్ గెల‌వ‌గానే అడ్ర‌స్ కూడా లేడు. రాముల‌మ్మ విజ‌య‌శాంతిని కూడా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రమంతా పర్య‌టించి ప్ర‌చారం చేసినా కూడా విజ‌య‌శాంతిని ఓట‌ర్లు ప‌ట్టించుకోలేదు. ప‌క్క రాష్ట్రాల నుంచి మాజీ హీరోయిన్లు న‌గ్మ‌, ఖుష్బూ లాంటి వాళ్ల‌ను కాంగ్రెస్ తీసుకొచ్చినా కూడా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. మొత్తంగా ఈ ఎల‌క్ష‌న్స్ లో కేసీఆర్ స్టామినా ముందు సినిమా వాళ్ల గ్లామ‌ర్ అస్స‌లు నిల‌బ‌డ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here