ద‌ర్శ‌కురాలు బి జ‌య క‌న్నుమూత‌..

హ‌రికృష్ణ మ‌ర‌ణం మ‌ర‌వ‌క ముందే తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో షాకింగ్ న్యూస్ వ‌చ్చింది. ప్ర‌ముఖ నిర్మాత బిఏ రాజు స‌తీమ‌ణి బి జ‌య అనారోగ్యంతో క‌న్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఆగ‌స్ట్ 30 రాత్రి ప‌రిస్థితి మ‌రింత విష‌మించింది. దాంతో ద‌గ్గ‌ర్లోని కేర్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు.

jaya

కానీ అప్ప‌టికే ప‌రిస్థితి చేదాటిపోయింది. చికిత్స పొందుతూ ఆమె మ‌ర‌ణించారు. ఈమె మృతి ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసారు. హ‌రికృష్ణ మ‌ర‌ణం మ‌ర‌వ‌క ముందే జ‌య మ‌ర‌ణం షాకే. ఎమ్ఏ సైకాల‌జీ చ‌దివిన జ‌య‌.. ఓ న్యూస్ పేప‌ర్ లో జ‌ర్న‌లిస్ట్ గా ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసారు. 2003లో బాలాదిత్య హీరోగా వ‌చ్చిన చంటిగాడు సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారారు. ఆ త‌ర్వాత గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు.. ప్రేమికులు.. ల‌వ్లీ లాంటి సినిమాల‌తో ద‌ర్శ‌కురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెర‌కెక్కించిన చివ‌రి సినిమా వైశాఖం 2017లో విడుద‌లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here