వెంక‌టేశ్వ‌ర‌స్వామితో వ‌ర్మ ముచ్చ‌ట్లు..

దేవుడు అంటేనే వ‌ర్మ న‌మ్మ‌డు.. అస‌లు దేవున్ని న‌మ్మిన‌ట్లు కానీ.. ఒక్క‌సారి కూడా ఆయ‌న బొట్టు పెట్టిన‌ట్లు కానీ ఇన్నేళ్ల‌లో ఎప్పుడూ చూడ‌లేదు. అప్పుడెప్పుడో ఒక్క‌సారి వినాయ‌కున్ని మొక్కి అంద‌ర్నీ టెన్ష‌న్ పెట్టాడు వ‌ర్మ‌. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఏకంగా వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌గ్గ‌రికే వెళ్లాడు. ఆయ‌న్ని ద‌ర్శించుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. అక్టోబ‌ర్ 18న ద‌స‌రా సంద‌ర్భంగా ఆయ‌న తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్నాడు. అస‌లు వ‌ర్మ తిరుప‌తి రావ‌డం ఏంటి అనే షాక్ లో ఉండ‌గానే.. రావ‌డం ద‌ర్శించుకోవ‌డం వెళ్లిపోవ‌డం జ‌రిగాయి. త‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సూప‌ర్ హిట్ కావాల‌ని.. త‌న‌కు మంచి పేరు తీసుకురావాల‌ని దేవున్ని కోరిన‌ట్లుగా తెలిపాడు వ‌ర్మ‌.

director-varma
అదేంటో కానీ ఆయ‌న సీరియ‌స్ గా చెప్పినా కూడా కొన్ని సార్లు సెటైర్లు వేసిన‌ట్లుగానే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. తిరుప‌తికి రావ‌డం.. మొక్క‌డం అంతా క‌ల‌గా మారిపోయింది. పైగా తాను దేవున్ని న‌మ్ముతాను కానీ భ‌క్తుల్ని న‌మ్మ‌నంటూ త‌న‌కే సాధ్య‌మైన ఓ వెరైటీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే కావాల‌నే వ‌ర్మ ఇదంతా చేస్తున్నాడు అనిపించ‌క మాన‌దు. అయినా అక్క‌డున్న‌ది వ‌ర్మ‌.. ఆయ‌న్ని అర్థం చేసుకోవాల‌నుకోవ‌డం అంటే మ‌న ఖ‌ర్మ‌. అది అంత ఈజీగా సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. చాలా పెద్ద‌పెద్ద వాళ్ల‌కే వ‌ర్మ అర్థం కాలేదు.. మ‌న‌మెంత‌. ఏం చేసినా కూడా పాపం వెంక‌టేశ్వ‌ర స్వామి అంద‌రికీ కొంగుబంగారం.. ఆయ‌న్ని టెన్ష‌న్ పెట్ట‌కుండా ఉంటే చాలు అంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here