ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి బ‌ర్త్ డే స్పెష‌ల్

తెలుగు సినిమా క‌ల‌లో కూడా ఊహించ‌ని స్థాయిని తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు.. అప‌జ‌యం ఎరుగ‌ని జ‌య‌భేరి మోగిస్తున్న ద‌ర్శ‌క దిగ్గ‌జం.. చేసింది 11 సినిమాలే కానీ అన్నింటితోనూ అద్బుతాలు చేసిన అప‌ర సినీ మేధావి.. టాలీవుడ్ రూపురేఖ‌లు మార్చి మార్కెట్ లో స‌రికొత్త సామ్రాజ్యం సృష్టించిన జ‌క్క‌న్న‌.. ఇలా రాజ‌మౌళి గురించి ఎన్ని చెప్పినా త‌క్కువే.

Rajamouli

ఈయ‌న సాధించింది చూస్తుంటే అస‌లు ఇన్నేళ్ల‌లో ఏ ద‌ర్శ‌కుడు ఎందుకు ఇంత పాష‌నేట్ గా లేడు అనిపిస్తుంది. త‌క్కువ సినిమాల‌తోనే త‌న‌కంటూ స్థాయి సృష్టించుకున్నాడు రాజ‌మౌళి. ఇప్పుడు ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ ఈయ‌నే. బాహుబ‌లి త‌ర్వాత ఈయ‌న స్థాయి అలా పెరిగిపోయింది.

అక్టోబ‌ర్ 10న ఈయ‌న 45వ వ‌డిలోకి అడుగు పెడుతున్నాడు. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత సింహాద్రితో ఇండ‌స్ట్రీ రికార్డులు మార్చేసాడు. ఆ త‌ర్వాత సై.. చ‌త్ర‌ప‌తి.. విక్ర‌మార్కుడు.. య‌మ‌దొంగ‌.. మ‌గ‌ధీర‌.. మ‌ర్యాద‌రామ‌న్న.. ఈగ లాంటి సినిమాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాడు. ఇక బాహుబ‌లి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రం రెండు భాగాలు క‌లిపి 2500 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. దాంతో తెలుగు సినిమా రేంజ్ ప్ర‌పంచానికి తెలిసింది. అలా తెలిసేలా చేసాడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి దీంతో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here