బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు.. క‌నీసం ప‌ట్టించుకోండి గురూ.

ఎవ‌రా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. ఈ ఏడాది బాక్సాఫీస్ షేక్ చేసిన గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు పరుశురామ్. ఈయ‌న త‌ర్వాతి సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అంత పెద్ద విజ‌యం అందించిన త‌ర్వాత కూడా ఎందుకో తెలియ‌దు కానీ ప‌రుశురామ్ ఖాళీగా ఉన్నాడు.

Director parasuram About his Next Film

ఆ మ‌ధ్య ఈయ‌నతోనే మంచు విష్ణు త‌ర్వాతి సినిమా ఉండ‌బోతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోస‌మే కొన్ని రోజులుగా విష్ణు కూడా మ‌రే సినిమా సైన్ చేయ‌కుండా వేచి చూస్తున్నాడని చెప్పారు కానీ అందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నేది అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం విష్ణు న‌టిస్తున్న ఓట‌ర్ షూటింగ్ పూర్తైంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌ను కార్తిక్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమా త‌ర్వాత ప‌రుశురామ్ తోనే సినిమా ఉండ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాతే మంచు విష్ణుతో ఓ సినిమా చేయాల్సి ఉంది ప‌రుశురామ్. శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ‌లో మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా చేయాల్సి ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడ‌నే ప్ర‌చారం కూడా ఇండ‌స్ట్రీలో ఉంది. అయితే తాను విష్ణు సినిమా చేయ‌డం లేద‌ని ఆ మ‌ధ్య ప‌రుశురామ్ చెప్పాడు.

మ‌రి అదే నిజ‌మా.. ఒక‌వేళ నిజ‌మే అయితే ప‌రుశురామ్ త‌ర్వాతి సినిమా ఏంటి అనేది ఇప్పుడు ఆస‌క్త‌కిరంగా మారింది. ఇప్ప‌టికే గీతాఆర్ట్స్ లో మ‌రో సినిమాకు క‌మిటవ్వ‌డం.. హీరో మాత్రం ఇంకా ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డంతో ఎదురు చూపులు చూస్తూ ఉన్నాడు ప‌రుశురామ్. గీత‌గోవిందం స‌క్సెస్ రేంజ్ చూసిన త‌ర్వాత కూడా ఈయన వైపు ఎవ‌రూ రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. మొత్తానికి చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కుడి త‌ర్వాతి సినిమా ఎవ‌రితో ఉండ‌బోతుందో..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *