దేవ‌దాస్.. తేడా వ‌స్తే పెద్ద ఫ‌స‌క్..

దేవ‌దాస్ సినిమాపై ఇప్పుడు ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో.. ఎంత ఆస‌క్తి ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ ఈ సినిమాపై అంచ‌నాలు ఎన్ని ఉన్నాయో.. అనుమానాలు కూడా అన్నే ఉన్నాయి. దానికి కార‌ణం బిజినెస్.. దీనికి జ‌రిగిన ప్రీ రిలీజ్ బిజినెస్. నాని, నాగార్జున లాంటి స్టార్ హీరోలు ఉండ‌టంతో ఏకంగా 40 కోట్ల బిజినెస్ చేసారు నిర్మాత‌లు.

DEVADAS PRE RELEASE BUSINESS

ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉన్నార‌నే ధైర్యంతో బ‌య్య‌ర్లు కూడా ధైర్యంగానే సినిమాను కొనేసారు. ఇదే ఇప్పుడు దేవ‌దాస్ కు టెన్ష‌న్ పెంచేస్తుంది. ఇంత మొత్తం రావాలంటే తొలిరోజే క‌చ్చితంగా సూప‌ర్ టాక్ తెచ్చుకోవాలి. లేదంటే జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దేమో..?

ఎంత స్టార్ హీరోలు ఉన్నా కూడా సినిమాకు టాక్ బాగా రాక‌పోతే నిర్దాక్ష‌ణ్యంగా తిప్పి కొడుతున్నారు జ‌నాలు. ఇప్పుడు ఇదే ఫ్యాష‌న్ కూడా. అందుకే దేవ‌దాస్ విష‌యంలో చాలా టెన్ష‌న్ ప‌డుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రోవైపు నాని, నాగార్జున మాత్రం ఈ సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని.. ప్రేక్ష‌కులు ప‌డీ ప‌డీ న‌వ్వుకుంటార‌ని చెబుతున్నారు. ఈ సినిమాను నైజాంలో 11 కోట్ల‌కు అమ్మారు.. ఇక ఓవ‌ర్సీస్ లో 4.50 కోట్లకు అమ్మేసారు. అక్క‌డ 180 లొకేష‌న్స్ లో సెప్టెంబ‌ర్ 26 రాత్రి నుంచే భారీగా షోస్ ప‌డుతున్నాయి. ఇప్పుడు దేవ‌దాస్ ల‌క్ష్యం చాలా సింపుల్.. 40 కోట్లు వ‌స్తే సినిమా హిట్.. అంత‌కంటే త‌క్కువ‌గా వ‌స్తే ఫ‌స‌క్. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here