దేవ‌దాస్ ఫుల్ క‌లెక్ష‌న్స్.. నాగార్జున 4.. నాని 2..!

ఏంటి లెక్క అనుకుంటున్నారా..? మ‌న హీరోల‌కు వ‌ర‌స‌గా వ‌చ్చిన ఫ్లాపుల సంఖ్య ఇది. నాగార్జున‌కు వ‌ర‌స‌గా నాలుగో ఫ్లాప్ అయితే.. నానికి ఇది రెండోది. దేవ‌దాస్ ఆ మ‌ధ్య డుద‌లైంది.. టాక్ కూడా బాగానే వ‌చ్చింది.. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. నాని, నాగార్జున లాంటి స్టార్ హీరోలు ఉండ‌టంతో ఏకంగా 36 కోట్ల బిజినెస్ చేసారు నిర్మాత‌లు. ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉన్నార‌నే ధైర్యంతో బ‌య్య‌ర్లు కూడా ధైర్యంగానే సినిమాను కొనేసారు. కానీ విడుద‌లైన త‌ర్వాత సీన్ మాత్రం ఒక్క‌సారిగా రివ‌ర్స్ అయిపోయింది. ఈ సినిమాకు తొలి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ త‌ప్పిస్తే ఆ త‌ర్వాత ఎందుకో కానీ మ‌న ప్రేక్ష‌కులు దేవ‌దాస్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

Devadas
స్టార్ హీరోలున్నా కూడా టాక్ బాగా రాక‌పోతే నిర్దాక్ష‌ణ్యంగా తిప్పి కొడ‌తారు జ‌నాలు. కానీ అదేం విచిత్ర‌మో మ‌రి.. దేవ‌దాస్ కు టాక్ బాగా వ‌చ్చినా కూడా ఎందుకో కానీ అనుకున్న క‌లెక్ష‌న్లు అయితే రాలేదు. ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో కేవ‌లం 25 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. 6 రోజుల్లో 18 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత మ‌రో 7 కోట్లు తెచ్చింది. ఓవ‌రాల్ గా దేవ‌దాస్ రూపంలో మ‌రో ఫ్లాప్ అంటించుకున్నాడు నాని. నాగార్జున కూడా ఇప్పుడు అర్జంట్ గా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈ ఇద్ద‌రు హీరోలు నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here