ఫెమీనా మ్యాగ‌జైన్ పై దీపిక సెగ‌లు..

పెళ్లికి ముందే అన్నీ చూపించేస్తుంది దీపిక ప‌దుకొనే. రేపో ఎల్లుండో ర‌ణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకోబోతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇలాంటి టైమ్ లో కూడా అందాలు ఆర‌బోయడం మాత్రం ఆప‌డం లేదు ఈ భామ‌. ఓ వైపు పెళ్లి ప‌నుల‌తో పాటు మ‌రోవైపు కెరీర్ కూడా దారి త‌ప్ప‌కుండా చూస్తుంది దీపిక‌. అన్న‌ట్లు ఇప్పుడు ఈమె బాలీవుడ్ లోనే కాదు ఏ వుడ్ లోనూ సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు.

హాట్ ఫోటోషూట్లు చేస్తుంది కానీ సినిమాలు మాత్రం నో అంటుంది. దీనికి నిద‌ర్శ‌నంగానే ప‌ద్మావ‌తి త‌ర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు న‌టిస్తున్న జీరో సైతం ఎప్పుడో ఓకే చేసిన ప్రాజెక్ట్. ఇందులో షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టిస్తుంది దీపిక‌. అనుష్క శ‌ర్మ మ‌రో హీరోయిన్. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినా కూడా ఆయ‌న ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అదిప్పుడు ఆగిపోయింది.

ఉన్న‌ట్లుండి ఇలా సైలెంట్ అయిపోవ‌డం వెన‌క కార‌ణం ఆరా తీస్తే పెళ్లి చేసుకోవ‌డ‌మే అని కొంద‌రు అంటున్నారు. ర‌న్ వీర్ సింగ్ ను త్వ‌ర‌లోనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది. ఇక దాంతోపాటు మెడనొప్పితో దీపిక బాధ ప‌డుతుంద‌ని.. అందుకే సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీపిక మేనేజ‌ర్ వ‌ర్గం మాత్రం ఇవేవీ స‌రైన కార‌ణాలు కావ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఆమె పెళ్లి చేసుకున్నా కూడా కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఆమె సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం మంచి క‌థ‌లు రాక‌పోవ‌డ‌మే అని తెలుస్తుంది. త‌న‌ను ఎగ్జైట్ చేసే క‌థ‌లు లేనందుకే దీపిక ఏ సినిమా ఒప్పుకోవడం లేద‌ని చెబుతున్నారు వాళ్లు. మొత్తానికి కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం ఫోటోషూట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోయింది దీపిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here