దీపిక‌కు పెళ్లంటే ఎందుకంత కోపం..?

పెళ్లంటే కోపం ఎందుకుంటుంది..? త‌్వ‌ర‌లోనే ఈ భామ బాలీవుడ్ హీరో ర‌ణ్వీర్ సింగ్ ను పెళ్లి కూడా చేసుకోబోతుంది క‌దా.. ఇప్పుడు పెళ్లంటే కోపం ఏంటి అనుకుంటున్నారా..? ఏమో మ‌రి.. కార‌ణం తెలియ‌దు కానీ పెళ్లంటే మాత్రం ఆకాశ‌మంత ఎత్తు ఎగురుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ విష‌యం అడిగిన వాళ్ల‌ను కూడా చెడామ‌డా తిట్టేస్తుంది.

ఇప్పుడు మీడియా వాళ్ల‌కు కూడా ఈ అక్షింత‌లు త‌ప్ప‌లేదు. ఈ మ‌ధ్యే ఓ ఈవెంట్ కు వ‌చ్చిన దీపిక ప‌దుకొనేను పెళ్లి గురించి అడిగారు. అయితే అవును అని.. లేదంటే కాద‌ని స‌మాధానం చెప్పాలి కానీ నీకెందుకు ఇవ‌న్నీ.. అస‌లు ఇప్పుడు అడిగే ప్ర‌శ్నేనా ఇది.. క‌నీసం కామ‌న్ సెన్స్ లేదా అంటూ రిపోర్ట‌ర్ ను ఫుల్లుగా క్లాస్ పీకింది దీపిక‌.

deepika padukone cleavage

ఆమె తీరుతో అక్క‌డున్న వాళ్లంతా షాక్ అయ్యారు. పెళ్లి పేరు ఎత్త‌గానే చిర్రెత్తుకొచ్చిందంటే ర‌ణ్వీర్ సింగ్ ఏదైనా చిలిపి ప‌ని చేసాడా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పెళ్లి కోస‌మే సినిమాలు కూడా ఒప్పుకోవ‌డం లేదు దీపిక‌. ప‌ద్మావ‌తి త‌ర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు.

ఇప్పుడు న‌టిస్తున్న జీరో సైతం ఎప్పుడో ఓకే చేసిన ప్రాజెక్ట్. ఇందులో షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టిస్తుంది దీపిక‌. అనుష్క శ‌ర్మ మ‌రో హీరోయిన్. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినా కూడా ఆయ‌న ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అదిప్పుడు ఆగిపోయింది. దాంతో దీపిక జీరో త‌ప్ప మ‌రో సినిమా ఏదీ చేయ‌డం లేదు. ఉన్న‌ట్లుండి ఇలా సైలెంట్ అయిపోవ‌డం వెన‌క కార‌ణం ఆరా తీస్తే పెళ్లి చేసుకోవ‌డ‌మే అని కొంద‌రు అంటున్నారు.

దీపిక సినిమాలు ఒప్పుకోక‌పోవ‌డానికి ఇదో కార‌ణం అయితే మ‌రో కార‌ణం మెడనొప్పి. ఈమె ఆరోగ్యం స‌రిగ్గా లేనందుకే ఇప్పుడు సినిమాలు చేయ‌డం లేద‌ని తెలుస్తుంది. అయితే దీపిక మేనేజ‌ర్ వ‌ర్గం మాత్రం ఇవేవీ స‌రైన కార‌ణాలు కావ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఆమె పెళ్లి చేసుకున్నా కూడా కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతానికి ఆమె సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం మంచి క‌థ‌లు రాక‌పోవ‌డ‌మే అని తెలుస్తుంది. త‌న‌ను ఎగ్జైట్ చేసే క‌థ‌లు లేనందుకే దీపిక ఏ సినిమా ఒప్పుకోవడం లేద‌ని చెబుతున్నారు వాళ్లు. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్దుగుమ్మ మ‌న‌సు గెలిచే క‌థ‌లు ఎక్క‌డున్నాయో ఏమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here